హీరోయిన్ బర్త్ డే పార్టీ, చిరు మాజీ అల్లుడు అట్రాక్షన్!
హైదరాబాద్: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ పెళ్లి చేసుకోవడం, తదనంతరం జరిగిన హైడ్రామా...ఇద్దరూ ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయిన తర్వాత శ్రీజ, శిరీష్ భరద్వాజ్ మధ్య పొసగక పోవడం....ఇద్దరూ విడాకులు తీసుకోవడం తెలిసిందే.
చిరంజీవి కుటుంబంతో ప్రస్తుతం శిరీష్ భరద్వాజ్‍కు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం శిరీష్ భరద్వాజ్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ.....తరచూ సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆ మధ్య ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. శిరీష్ భరద్వాజ్ నరేంద్ర మోడీని కలవడం కూడా చర్చనీయాంశం అయింది.

చిరంజీవి కుటుంబంతో గత సంబంధాల వల్ల ఇప్పటికీ శిరీష్ సెలబ్రిటీ స్టాటస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తరచూ తెలుగు సినీ సర్కిల్‌లో కనిపిస్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. తాజాగా తెలుగు సినిమా నటి శ్రీలేఖ రెడ్డి బర్త్ డే పార్టీ శిరీష్ భరద్వాజ్ దర్శన మిచ్చారు. ఆమెతో శిరీష్ భరద్వాజ్ చాలా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశం అయింది. ఈ బర్త్ డే వేడుకలో హృదయకాలేయం హీరో సంపూర్ణేష్ బాబు, నిర్మాత పుప్పాల రమేష్, దర్శకుడు స్టీవెన్ శంకర్, రాజా రవీంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో పలువురు శ్రీలేఖ రెడ్డితో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసారు.


Click it and Unblock the Notifications











