చిరంజీవి స్ధాపించినవ ప్రజారాజ్యం పార్టీ గుర్తు విషయంలో ఇప్పటికీ సమస్యగానే ఉన్న విషయం తెలిసిందే. అయితే పార్టీ పెట్టిన మొదట్లో రైలు, సూర్యుడు గుర్తు బాగుంటుదనే అభిప్రాయమున్నా తాజాగా కెమేరా గుర్తు వీటి సరసన చేర్చుతున్నట్లు తెలిసింది.ఆళ్లగడ్డ జడ్పీటీసీ ఎన్నికల్లో పీఆర్పీ బలపరచిన అభ్యర్థి మాదం రవి కెమెరా గుర్తుతో బరిలోకి దిగి భారీ మెజారెటీతో నెగ్గటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఈ గెలుపు పీఆర్పీ మొట్టమొదటి విజయంగా భావించారు. అందుకే మొట్టమొదట బోణీ ఏగుర్తుపై చేశామో అదే గుర్తు పొందాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం.30 ఏళ్ల పాటు సినీ రంగంలో కెమేరా ముందు నటించి ప్రజాభిమానం పొందారు. అదే విధంగా తన రాజకీయ జీవితంలోనూ కెమేరా పార్టీ గుర్తు ఉంటే విజయవకాశాలు ఉంటాయనే సెంటిమెంట్ బలంగా ఉందని సమాచారం. ఈ విషయాన్ని పీఆర్పీకి చెందిన జిల్లా నేత ఒకరు పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.