»   » షాక్: తప్పతాగి చిరంజీవి వెంట పడ్డారు!

షాక్: తప్పతాగి చిరంజీవి వెంట పడ్డారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. కొందరు యువకులు తప్పతాగి ఆయన కారును వెంబడిస్తూ వేధింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏదో పని మీద ఆయన బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కి వెళ్లారు. తిరిగి వస్తుండగా తప్పతాగిన కొందరు యువకులు ఆయన కారును వెంబడిస్తూ వేధించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజ్ కృష్ణ హోటల్ నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు వారు చిరంజీవి కారును వెండించినట్లు సమాచారం. చిరంజీవి తన వెంట ఉన్న సెక్యూరిటీకి వారి గురించిన వివరాలు సేకరించాలని చెప్పినట్లు సమాచారం. మరి చిరంజీవి వారిపై కంప్లైంట్ చేస్తారా? వారితో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Chiranjeevi

చిరంజీవి 150
చిరంజీవి 150 వ చిత్రం ప్రకటించేదాకా మీడియాలో, అభిమానుల్లో ఇదే పెద్ద చర్చనీయాంశంగా ఉంటోంది. ఎక్కడ ఏ సినిమా రిలీజై హిట్టైనా దాని రైట్స్ తీసుకుని చిరంజీవి సినిమా చేసేస్తారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా అలాంటి రూమర్ ఒకటి గత కొద్ది రోజులు గా తమిళ సిని వర్గాలో మొదలైంది.

చిరంజీవి దృష్టి రీసెంట్ గా అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాలం' కన్నుపడిందని, ఈ మేరకు ఆయన ఆ నిర్మాతను స్పెషల్ షో వేయమని చెప్పనట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా చిరంజీవి... విజయ్ హీరోగా వచ్చిన కత్తి చిత్రం రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.

English summary
Recently Chiru had been to Taj Krishna Hotel in Banjara Hills. As he came out of the hotel in his car, some youths, obviously in inebriated condition followed him and irritated him by hooting and shouting and yelling at the car.
Please Wait while comments are loading...