twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి కుటుంబంపై తేనెటీగల దాడి.. అసలు ఏం జరిగిందంటే?

    |

    ఉపాసన తాత, దోమకొండ సంస్థానం వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ కామినేని ఉమాపతిరావు అంత్యక్రియల్లో అపశ్రుతి జరిగింది. అంతిమ యాత్రలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడి చేశాయి. అయితే ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    ఎన్నో ఘటనలకు సాక్షి..

    ఎన్నో ఘటనలకు సాక్షి..


    కామినేని ఉమాపతిరావు మరణంపై స్పందించిన ఉపాసన సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. ఉపాసన తన తాత గురించి చెబుతూ.. ‘రజాకర్ ఉద్యమం, భారతదేశం స్వేచ్ఛ కోసం పోరాటం, మరెన్నో చారిత్రక సంఘటనలను ప్రత్యక్ష సాక్షి. తిరుమల తిరుపతి దేవస్థానంమొదటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దయ, మతంపై అత్యంత విశ్వాస్వం గల వ్యక్తి. గొప్ప నియమాలు, నిస్వార్థత, ఔదార్యం & హాస్యచతురత కలిగిన వ్యక్తి' అంటూ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.

    నేడు అంత్యక్రియలు..

    నేడు అంత్యక్రియలు..


    ఉమాపతిరావు అంత్యక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం కోటలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో చిరంజీవి ఫ్యామిలీతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా పాల్గొంది. బంధుమొత్ర

    తేనేటీగల దాడి..

    తేనేటీగల దాడి..

    అంత్యక్రియలకు పార్థివదేహాన్ని తీసుకుళ్తోన్న సమయంలో అక్కడే ఓ చెట్టుపై నుంచి తేనేటీగలు దాడికి దిగాయి. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కామినేని కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి ఫ్యామిలీని సురక్షితంగా ఓ గదిలోకి తీసుకెళ్లారు.

    Recommended Video

    Balakrishna Silence On Nagababu's Warning Is Most Debatable Point Now
    స్వల్ప గాయాలు..

    స్వల్ప గాయాలు..

    అప్రత్తమైన సిబ్బంది అక్కడి నుంచి తేనెటీగలను అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన లకు రెండు మూడు తేనెటీగలు వారికి కుట్టాయని తెలిసింది. కాగా, తేనెటీగలు కుట్టడంతో నలుగురు గ్రామస్థులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.

    English summary
    Chiranjeevi Family Attacked By Honeybee. In Upasana Konidela Grand Father Kamineni Umapathy Rao Last Journey Family Membders Were Attacked By Honeybees
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X