కేరళ వరదలు: చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అంజనా దేవి భారీ సహాయం!
కేరళ రాష్టం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. కేరళను ఆదుకోవాలని సీఎం పినరాయి విజయన్ కోరడంతో పలువురు ప్రముఖులు. ప్రజలు తవంతుగా సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్స్ డొనేషన్స్ అందించగా... తాజాగా మెగాస్టార్ ఫ్యామిలీ నుండి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అంజనా దేవి విరాళం ప్రకటించారు.

చిరంజీవి, రామ్ చరణ్
కేరళ వరద బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.25 లక్షలు, చరణ్ రూ.25లక్షలు ప్రకటించారు. ఈ మేరకు వారు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి మొత్తం రూ. 50 లక్షలు జమ చేశారు.

ఉపాసన కూడా..
అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లలో ఒకరైన ఉపాసన తనవంతు సహాయంగా రూ. 10 లక్షలు విలువ చేసే మందులను కేరళకు పంపించారు.

అంజనా దేవి
చిరంజీవి తల్లి అంజనా దేవి సైతం తన వంతుగా రూ. లక్ష కేరళ సహాయ నిధికి విరాళం అందించారు. ఇలా మొత్తం మెగా స్టార్ కుటుంబం నుండి రూ. 61 లక్షల సహాయం అందింది.

సహాయం అందించిన సినీ ప్రముఖులు
తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇప్పటికే పలువురు ప్రముఖులు సహాయం అందించారు. బన్నీ రూ. 25 లక్షలు, విజయ్ దేవరకొండ 5 లక్షలు, రామ్ పోతినేని 5 లక్షలు, కొరటాల శివ రూ. 3 లక్షలు సహాయం అందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











