మెగాస్టార్ ఇంట అవధుల్లేని ఆనందం.. రామ్ చరణ్‌ని ముద్దాడిన చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ సంబరాలు

సిల్వర్ స్క్రీన్‌పై మెగా హవా మొదలైంది. ప్రపంచమంతా కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సినిమా చూసి ప్రేక్షక లోకం నీరాజనం పడుతోంది. ఓవర్సీస్ తెరలపై పడిన ప్రీమియర్ షో ద్వారా అనుకున్న దాన్ని మించి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో సైరా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన అభిమాన వర్గాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

సైరా నరసింహా రెడ్డి.. పాజిటివ్ రెస్పాన్స్

సైరా నరసింహా రెడ్డి.. పాజిటివ్ రెస్పాన్స్

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. చిత్రంలో అందరి నటనకూ మంచి మార్కులు పడుతున్నాయి.

మెగాస్టార్ ఇంట అవధుల్లేని ఆనందం

మెగాస్టార్ ఇంట అవధుల్లేని ఆనందం

ఎంతో ప్రేమగా తండ్రి చిరంజీవికి కానుకగా ఇవ్వాలని ఈ సినిమా తెరకెక్కించారు రామ్ చరణ్. ఈ మేరకు రామ్ చరణ్ స్వీయ నిర్మాణం చేపట్టి అన్ని జాగ్రత్తలూ తీసుకొని ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను మేళవించి అవుట్‌పుట్ ఇచ్చారు. సో ఈ సినిమా తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మెగాస్టార్ ఇంట అవధుల్లేని ఆనందం కనిపిస్తోంది.

బాస్ బస్టర్‌కు ధన్యవాదాలు అంటూ చెర్రీ

'ఈ బాస్ బస్టర్‌కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెబుతూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మెసేజ్ పెట్టాడు చెర్రీ. దీంతో పాటు తండ్రి చిరంజీవి తనను గుండెలకు హత్తుకొని ముద్దాడుతున్న ఫొటోలను సోషల్ షేర్ చేశాడు. మెగా విజయానందంలో అరుదైన ఈ పిక్స్ చూసి తెగ మురిసిపోతున్నారు మెగా అభిమానులు.

Recommended Video

Chiranjeevi Opinion On His Biopic | Syeraa | Ram Charan | Allu Arjun | Varun Tej
 ఎక్కడ చూసినా సైరా నినాదమే

ఎక్కడ చూసినా సైరా నినాదమే

చరణ్‌ను ఎంతో ఆప్యాయంగా హత్తుకున్న చిరంజీవిని చూసి ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ చేసేశారు నెటిజన్లు. తండ్రీ, కొడుకుల ప్రేమానురాగాలు.. సైరా విజయం పట్ల శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌ లైన్ వేదికలు, థియేటర్లు ఎక్కడ చూసినా సైరా నినాదమే మారుమోగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X