చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు...
హైదరాబాద్: మెగాస్టార్ స్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఫిల్మ్ నగర్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత ఈ పూజలో పాల్గొన్నారు.
ప్రముఖుల మధ్య గ్రాండ్ గా బర్త్ డే పార్టీ...
చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరుగబోతున్నాయి. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాబోతున్నారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్, సల్మాన్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, శ్రీదేవి, బోనీ కపూర్, టబూ ఇలా పలువురు స్టార్స్ ఈ బర్త్ డే వేడుకలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ష్టష్ఠి పూర్తి వేడుక ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరుపబోతున్నారు.


Click it and Unblock the Notifications











