చిరును రారమ్మని భీమిలిలో నిరాహార దీక్ష
రాజకీయాలలోకి ఇపుడపుడే వచ్చేది లేదని కాస్తా ఆగండని స్పష్టంగా పత్రికా ప్రకటన ఇచ్చినా చిరంజీవి అభిమానులు మాత్రం చిరంజీవి సినిమాలలోకి రావాల్సిందేనని కోరుకుంటున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి రావాలని ఆ మధ్య తన కూతురు చిరుశ్రీతో దుర్గానాయుడు అనే వ్యక్తి నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పిన మరునాడే చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేశాడు.
అయినా అభిమానులు హద్దు మీరుతున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి రావాల్సిందేనని డిమాండ్ చేస్తూ భీమిలిలో తాజాగా ఆయన అభిమానులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. భీమిలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు. చిరంజీవి అభిమానులతో పాటు దళితులు కూడా నిరాహార దీక్షలో కూర్చోవడం విశేషం.


Click it and Unblock the Notifications











