నీకు పిల్లలుంటే తెలిసేది: చిరు అభిమానులు
శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ప్రేమ వివాహాన్ని జరిపిన న్యూ-బోయిన్ పల్లి ఆర్య సమాజ్ మందిర్ ప్రధాన పురోహితుడు బృహస్పతిని చిరంజీవి అభిమానులు వేధిస్తున్నట్టు ఆర్యసమాజ్ ప్రతినిధి విఠల్ రావు ఆర్య శుక్రవారం మీడియాకు తెలిపారు. చిరంజీవి అభిమానులు బృహస్పతి వద్దకు వెళ్లి.. నీకు పిల్లలుంటే తెలిసేది భాదేంటో..చిరంజీవికి చెప్పకుండా శ్రీజ పెళ్లి ఎందుకు చేశావు..అని విసిగిస్తున్నారని ఆయన వివరించారు. అభిమానులు ఇలా వేధించకుండా చిరంజీవి అభిమానులకు చెప్పాలని ఆయన కోరారు. చిరంజీవి చాలా సినిమాలలో ఇలాంటివి మామూలేనంటూ..ఆయన అభిమానులు సినిమాలు చూసి ఎలా ఫాలో అవుతారో శ్రీజ కూడా అలానే ఫాలో అయింది..ఇందులో తప్పేముంది...చిరంజీవి తన కూతురు, అల్లుడిని పిలిపించుకుని ఆశీర్వదించాలని విఠల్ రావు సూచించారు. అభిమానులు తమ వేధింపులను మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











