రేపు విజయవాడలో చిరుఫ్యాన్స్ బహిరంగసభ
చిరంజీవి రాజకీయాలలోకి రావాలని ఆయనకంటే ఎక్కువగా ఆయన అభిమానులే కోరుకుంటున్నారు. చిరంజీవి పార్టీ పెడుతున్నారని వచ్చిన వార్తలకే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెద్దయెత్తున సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలోని ఒక అడుగు ముందు కేసారు. బోండా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారంనాడు 10వేల మంది ఫ్యాన్స్ తో ఒక బహిరంగ సభను జరపడానికి సిద్ధమయ్యారు. ఈ సభను విజయవాడలోని ఐవీ ప్యాలెస్ లో ఈ సభ జరగనుంది. ఈ సభ తరువాత ఈ తరహా సభలే ఉభయ-గోదావరి జిల్లాల్లోనూ జరపనున్నట్టు బోండా తెలిపారు. చిరంజీవి రాజకీయాలలోకి రావాలనే ఈ సభలు జరుపుతున్నట్టు బోండా మీడియాకు చెప్పారు.


Click it and Unblock the Notifications











