చిరు, మహేష్ ఫ్యాన్స్ ఫైట్- చరణ్ కటౌట్ ధ్వంసం
తెలుగు టాప్ హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా, నందమూరి, ఘట్టమనేని(మహేష్ బాబు) కుటుంబాలకు చెందిన హీరోలు అభిమానుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ మధ్య సినిమా కలెక్షన్ల గొడవ వ్యవహారం తారా స్థాయికి చేరి కటౌట్ల వార్‌కు దారి తీసింది కూడా.
తాజాగా మరోసారి కలెక్షన్ల విషయంలో అభిమానుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. నెల్లూరులో రచ్చ సినిమా కలెక్షన్ల విషయమై చిరంజీవి-మహేష్ బాబు అభిమానుల మధ్య గురువారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో మహేష్ బాబు అభిమానులు రామ్ చరణ్ కటౌట్లను ధ్వంసం చేశారు. పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం ఇటీవల మొదటి వారం కలెక్షన్లు భారీగా, ఆల్ టైం రికార్డు సాధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మహేష్ బాబు అభిమానులు తీవ్రంగా స్పందించి అవన్నీ ఫేక్ రికార్డులని గొడవకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి సమర్పణలో ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ లు నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి


Click it and Unblock the Notifications











