చిరు నెక్ట్స్ బర్త్ డేకి 150వ సినిమా విడుదల...!
ఈ మధ్య చిరంజీవి తన 150 వ సినిమాని పెద్ద ఇష్యు చేస్తున్నాడు. నిన్నటి వరకు ఓసారి చేస్తాననీ, మరోసారి చెప్పలేననీ చెబుతూ వచ్చిన చిరంజీవి మొన్నటి నుంచి పాజిటివ్ న్యూస్ వదులుతున్నాడు. తన సినిమాకి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పిన చిరు, నిన్నదీనికి సంబంధించిన మరి కాస్త ప్రోగ్రెస్ ఇచ్చాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పాడు. వచ్చే తన బర్త్ డేకి, అంటే ఆగష్టు 22 కి సినిమా రిలీజ్ అవుతుందట.
అయితే, దర్శకుడెవరనేది ఇంకా సస్పెన్సే అంటున్నాడు చిరంజీవి. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సినిమాలో నటించమని అభిమానులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, వారి కోరికను తీర్చేందుకే మళ్ళీ నటించాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలింకా తుది రూపుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఏమైనా, ఆ సినిమాకి ఇప్పటి నుంచే రెండు రోజులకొక న్యూస్ ఇస్తూ, మంచి హైప్ తెచ్చుకుంటున్నాడు. ఇటు ఫ్యాన్స్ నోళ్ళలోన, అటు ప్రేక్షకల నోళ్ళనూ, ప్రజల నోళ్ళనూ బాగా నానుతున్నాడు.


Click it and Unblock the Notifications











