Allu Vs Mega: మెగా అభిమానులకు అల్లు అర్జున్ షాక్.. ట్రోలర్స్ ఎప్పటికైనా మూసుకుంటారా?
గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం అందులో కొందరి హీరోల నడుమ కోల్డ్ వార్ కోసం వార్తలు వినిపించేవి కానీ ఈ కొన్ని నెలల నుంచి మాత్రం రెండు టాప్ మోస్ట్ సినీ ఫ్యామిలీస్ లో జరిగే కోల్డ్ వార్ కోసం సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో హాట్ టాపిక్స్ గా నిలిచిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆ కుటుంబ కలహాలే మెగా అండ్ అల్లు కుటుంబం కోసమే అని చెప్పాలి.
ఈ ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు దీనికి ప్రధాన కారణం కాగా ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్న స్టాండ్ మెగా అభిమానులుకి నచ్చలేదు. దీనితో సోషల్ మీడియాలో సహా ఆఫ్ లైన్ లో కూడా మామూలు రచ్చ మొదలు కాలేదు. ఇక ఇక్కడ నుంచి అల్లు అర్జున్ కి కాని తన రాబోవు భారీ సినిమా పుష్ప 2 కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని చాలా రచ్చ కొనసాగింది.

కానీ మరోపక్క మాత్రం ఆ రెండు కుటుంబాలు ఒక్కటే ఒక టైం వచ్చేసరికి కలుస్తారు అని కొందరు సినీ ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా అల్లు అర్జున్ విషయంలో ఓ టాక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది దీనిపై ట్రోల్స్ కూడా నడుస్తాయి.
బన్నీ ఒక స్టేజి కి వచ్చేసరికి తన మూలాలు మెగాస్టార్ చిరంజీవిని పక్కన పెట్టేసాడు అని చాలా మాటలే వినిపించాయి. బన్నీ కూడా మెగా బ్రాండ్ కి దూరంగా ఉండాలనే అనుకున్నాడు అంటూ పలు రూమర్స్ కూడా వచ్చాయి. సో ఇలా అల్లు వర్సెస్ మెగా హీరోస్ నడుమ కోల్డ్ వార్ మాత్రం అలా కొనసాగుతుంది అని చెప్పొచ్చు.
కాగా దీనికి ఎండ్ కార్డు అభిమానుల్లో ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు కానీ బన్నీ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ కి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. బన్నీ ఇంట్లో ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవిపై పెద్ద ఫ్రేమ్ ఉందట. కాగా ఇటీవల తన కోసం ఓ అభిమాని సైకిల్ మీద వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ కలయిలో ఓ పిక్ వైరల్ అవుతుంది.
ఇందులో సీనియర్ ఎన్టీఆర్ పై ఓ బుక్ కనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ పిక్ పెట్టుకున్న బన్నీ ఇంట్లో చిరు ఫోటో లేదా అనే ప్రశ్నకు బన్నీ టీం నుంచి సమాధానం వచ్చింది. చిరంజీవిపై పెద్ద ఫ్రేమే అది కూడా టాప్ లో ఉంటుంది అని తెలిపారు. దీనితో బన్నీ విషయంలో మెగాస్టార్ కి దూరంగా ఉన్నాడు ఒక స్టేజ్ వచ్చేసరికి చిరుపై అభిమానం పక్కన పెట్టేసాడు అనే మాటలు చాలా మంది వెనక్కి తీసుకోవాలి అని చెప్పాల్సిందే.
ఇంకా అల్లు అర్జున్ పుష్ప 2లో మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా కూడా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చిరు ఫ్యాన్ గా పుష్పరాజ్ కటౌట్ కూడా వైరల్ అయ్యింది. మరి మళ్లీ మెగా కుటుంబం సహా అల్లు అర్జున్ కూడా ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే అంతా సెట్ అయ్యిపోతుంది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











