ట్విట్టర్‌లోకి రామ్ చరణ్ ఎంట్రీ.. సింహాన్ని ఫాలో అవుతుందంటూ మెగాస్టార్ రిప్లై

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ట్వీట్లతో దుమ్ములేపేశాడు. ఉగాది శుభాకాంక్షలు తెలిపి, కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధాని,ముఖ్య మంత్రుల నిర్ణయాలను అందరూ అనుసరించాలని, 21 రోజుల లాక్ డౌన్‌ను పాటించాలని అందరూ ఇంటి పట్టునే ఉండాలని సూచించాడు. అయితే తండ్రి బాటలోనే రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు.

Recommended Video

Megastar Chiranjeevi Welcomes Ram Charan Into Twitter In Mega Style | Ram Charan Into Twitter

ట్విట్టర్‌లోకి ఎంట్రీ..

ఇంత వరకు రామ్ చరణ్‌కు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు మాత్రమే ఉండేవి. తాజాగా రామ్ చరణ్ ట్విట్టర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉగాది రోజున చిరంజీవి ఎంట్రీ ఇస్తే.. తెల్లారి చెర్రీ ప్రవేశించాడు. వచ్చీ రావడంతో ఓ ట్వీట్ చేసి అందర్నీ ఫిదా చేశాడు.

 పవన్ కళ్యాణ్ స్పూర్తితో..

పవన్ కళ్యాణ్ స్పూర్తితో..

కరోనా లాంటి మహమ్మారిని ఎదురించడానికి పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయలను ప్రకటించాడు. దీన్ని స్పూర్తిగా తీసుకున్న తాను కూడా 70 లక్షల రూపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా ప్రకటిస్తున్నానని ట్వీట్ చేశాడు.

రామ్ చరణ్‌కు ఘన స్వాగతం..

రామ్ చరణ్ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ ప్రముఖులంతా స్వాగతం పలికారు. రామ్ చరణ్ ప్రకటించిన విరాళానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం రామ్ చరణ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. విరాళాన్ని ప్రకటించడమెంతో సంతోషమని అన్నాడు.

 పిల్ల.. సింహాన్ని ఫాలోఅవుతుంది..

పిల్ల.. సింహాన్ని ఫాలోఅవుతుంది..

రామ్ చరణ్ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని ఉద్దేశిస్తూ.. పిల్ల సింహం.. తండ్రి సింహాన్ని ఫాలో అవుతుందని చమత్కరించాడు. ట్విట్టర్ ప్రపంచంలోకి రామ్ చరణ్‌కు స్వాగతం పలికాడు. మొత్తానికి రామ్ చరణ్ ట్విట్టర్‌లోకి ఎంట్రీ అవ్వడం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X