»   » అసలు విషయం బయట పెడతా....... ఇది చిరంజీవికి సలహానా? వార్నింగా?

అసలు విషయం బయట పెడతా....... ఇది చిరంజీవికి సలహానా? వార్నింగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రామ్ గోపాల్ వర్మ గురించి.... ఘాటుగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వాడికి ఇపుడు సినిమాలే సరిగా తీయడం రాడం లేదు, వాడు అన్నయ్య చిరంజీవి 150వ సినిమాపై విమర్శలు చేస్తాడా? వాడో అక్కు పక్షి అంటూ నాగ బాబు చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి.

అయితే నాగబాబు కామెంట్లకు రామ్ గోపాల్ వర్మ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. తమ్ముడి గురించి చిరంజీవి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అయితే అందులో కొన్ని వార్నింగుల్లా ఉండటం గమనార్హం.

మీ తమ్ముడు నోరు మూసుకోక పోతే అసలు విషయాలు ట్వీట్స్ చేస్తాను అంటూ.... బెదిరింపులకు దిగారు. ఇంతకీ ఆ అసలు విషయం ఏమిటి? వర్మ దగ్గర వారికి సంబంధించి ఏమనా సీక్రెట్స్ ఉన్నాయా? అంటూ చర్చించుకుంటున్నారంతా.

నాశనం చేస్తాడు

‘చిరంజీవిగారు.. మీ తమ్ముడని, అతడిని మీరు ఎంత ఇష్టపడతారో నాకు తెలుసు. కానీ, భవిష్యత్తులో ఇలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు అతడిని వెంట తీసుకెళ్లకండి. తీసుకెళితే.. ఆ ఫంక్షన్ మొత్తాన్ని నాశనం చేసేస్తాడు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

అసమర్థుడు

చిరంజీవిగారు.. ఇలాంటి అసమర్థ సోదరుడిని ఇష్టపడితే మీరు సాధించిన గొప్ప విజయాలు, మీ గొప్పతనం అంతా సర్వనాశనం అవుతాయి అంటూ వర్మ ట్వీటాడు.

మీ స్వార్జితంతో ఇదంతా సాధించారు

‘చిరంజీవిగారు.. మీరు మీ స్వార్జితంతో ఇదంతా సాధించారు. అయితే.. నాగబాబు మాత్రం ‘150' లాంటి గొప్ప కార్యక్రమాలను నాశనం చేయడం తప్ప ఏం చేయలేదన్న విషయం మీకు కూడా తెలుసు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

మీ సన్నిహితులే

చిరంజీవిగారు.. మిమ్మల్ని ముంచే వాళ్లు మీకు అతి సన్నిహితులే. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఓ అభిమానిగా ఈ విషయం గురించి మీకు చెబుతున్నాను అంటూ వర్మ ట్వీట్ చేసారు.

ఏం చేయకపోవడమే మీకు మంచిది

చిరంజీవిగారు.. మీరు నాగబాబు చేసిన దాంట్లో నాగబాబు గారు మీకు చేసింది కొంతలోకొంత ఏమీ లేదు. అతడు ఏం చేయకపోవడమే మీకు మంచింది... అని వర్మ ట్వీట్ చేసారు.

మిమ్మల్ని కాకా పట్టడానికే

‘చిరంజీవిగారు.. మిమ్మల్ని కాకా పట్టడానికే నాగబాబు అలా మాట్లాడాడని మీకు కూడా తెలుసు. ఆ మాటలు మీకు నష్టం కలిగించాయని, అయినా తమ్ముడన్న ఒకే ఒక్క కారణంతో మీరు భరిస్తున్నారని తెలుసు. అది బాధాకరం అంటూ వర్మ ట్వీట్ చేసారు.

లేదంటే అసలు విషయాలు బయట పెడతా

చిరంజీవిగారు.. మీమీద గౌరవంతో నేనింకా ట్వీట్లు పెట్టడం మానేస్తాను. కాకపోతే మీ తమ్ముడిని నోరు మూసుకోమనండి. లేదంటే అసలు విషయాల గురించి నేను ట్వీట్లు చేయడం మొదలుపెడతాను. అంటూ వర్మ ట్వీట్ చేసారు.

క్షమాపణలు

నాగబాబు వల్ల కలిగిన అసౌకర్యానికి చిరంజీవి అభిమానులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా. అతడి తరఫున కూడా క్షమాపణలు కోరుతున్నా అంటూ వర్మ ట్వీట్ చేసారు.

పాజిటివ్, నెగెటివ్ బ్యాలెన్స్

పవన్, చరణ్, సాయిధరం, వరుణ్, బన్నీ వంటి ఎన్నో పాజిటివ్‌లను చిరంజీవి కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. కానీ, వాటిని బ్యాలెన్స్ చేయడానికా అన్నట్టు నాగబాబు గారిని కూడా ఇచ్చాడు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

English summary
"Chiranjeevi gaaru I know he is ur brother nd u love him but in future please don't take him to such prestigious events as he will spoil them. Chiranjeevi gaaru u should not let ur love for an incompetent brother spoil the greatness of ur being and the greatness of ur achievements. Chiranjeevigaaru u achieved by urself nd u in heart know he did nothing except things like spoiling great events like 150..I feel sad for u." RGV tweeted,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu