జర్నలిస్టులు భేష్.. అవార్డులు నిరాదరణకు గురైన సమయంలో.. చిరంజీవి ఎమోషనల్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధాన భూమికను ప్రోత్సాహిస్తున్న తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్‌లో గురువారం తమ సంఘం సభ్యులకు హెల్త్ కార్డులను, మెంబర్ షిప్ కార్డులను అందించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ వేడుకలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మినారాయణ, కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు, కమిటీ సభ్యులు, అసోసియేషన్ మెంబర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..
కరోనా ఆపద సమయంలో CCC పెట్టినప్పుడు జర్నలిస్టు సోదరులను కలుపుదాం అని చెప్పాను. 24 క్రాఫ్టులతోపాటు జర్నలిస్టులను కలిపి వారికి నిత్యావసర వస్తువులు అందించే అవకాశం భగవంతుడు కల్పించారు. అలాగే ఒక డయాగ్నిస్టిక్ సెంటర్‌లో హెల్త్ కార్డులు అందించే ప్రయత్నం, నా వంతు సహాయం చేశాను. దాని వల్ల కలిసి వచ్చిందని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. మీ కోసం ఎప్పుడు అండగా ఉంటాం. మేము చేసింది చాలా తక్కువ. చేయాల్సింది చాలా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చక్కటి సలహా ఇచ్చారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి జర్నలిస్టులకు 1 లక్షల రూపాయలు అందించే సలహాను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాం అని చిరంజీవి చెప్పారు.

సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ను తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించడానికి ముందుకు రావడం చాలా హ్యపీగా ఉంది. ఇంతవరకు ఇలాంటి ఫెస్టివల్‌ను ఎవరూ నిర్వహించలేదు. సినిమాలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలనే కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో నంది, ఇతర అవార్డులు నిరాదరణకు గురయ్యాయి. ఇలాంటి సమయంలో మీరు అవార్డులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. అవార్డుల కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను. ఈ ఫెస్టివల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు సహకారం, అండదండలు అందిస్తాను. ఈ హెల్త్ కార్డుల పంపిణి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. మీకు ఎఫ్పుడు అవసరం వచ్చినా ఒక ఫోన్ కాల్, మెసేజ్ దూరంలో ఉంటాను. నా ఇంటి తలుపులు ఎప్పుడు మీ కోసం తెరిచే ఉంటాయి అని చిరంజీవి అన్నారు.

ఆచార్య సినిమా రిలీజ్ ముందు రోజు ఎంతో బిజీగా ఉన్న చిరంజీవి అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకు రావడంపై టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మినారాయణ, కార్యదర్శి రాంబాబు, కార్యదర్శి నాయుడు, ఇతర సభ్యులు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యక్రమాలకు అండదండలు అందించాలని చిరంజీవిని వేడుకోగా అందుకు సానుకూలంగా స్పందించారు. ఎంతో ఓపికగా కమిటీ మెంబర్స్, అసోసియేషన్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగడంతో.. జర్నలిస్టు ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











