చిరంజీవి ఇంత ఎమోషనల్‌గా.. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు!
మెగాస్టార్ చిరంజీవి తానా ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో చిరంజీవి బిజీగా ఉన్నారు. రాజకీయ పరంగా కొంత గ్యాప్ తీసుకుని చిరంజీవి తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. చిరు నటించిన ఖైదీ నెం 150 చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా డల్లాస్ లో చిరు అభిమానుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిరు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఎమోషనల్ కావడం విశేషం. అభిమానులు ఉత్సాహం ఆప్యాయత చూసిన చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మధ్య కాలంలో చిరంజీవిని ఇంత ఎమోషనల్ గా ఎవరూ చూసి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక్కడకు వచ్చేవరకు తెలియదు
అభిమానుల కేరింతలు, ఉత్సాహం, ఆప్యాయత గమనించిన చిరు.. తాను మనసంతరాల్లోనుంచి మాట్లాడతానని అనుకోలేదని అన్నారు. భావోద్వేగంతో చిరంజీవి కళ్ళు చెమ్మగిల్లడం విశేషం.

మనసుని కదిలించిన సమావేశం
ఈ మధ్య కాలంలో తన మనసుని కదిలించిన ఆత్మీయ సమావేశం ఇదేనని అన్నారు. భోజన సమయం అవుతున్నా, చిన్న పిల్లలు ఆకలితో ఉన్నారనే విషయం భాద కలిగిస్తున్నా తనకు ఇంకా మాట్లాడాలని ఉందని చిరంజీవి అన్నారు.

ఆ విషయం మరచిపోయిన మెగాస్టార్
ప్రసంగించే ముందు సభని అలంకరించిన వారిని ఉద్దేశించి ప్రసంగించాసం సభా గౌరవం. కానీ అభిమానుల ఆప్యాయతతో ఆవిషయాన్ని చరియు మరచి పోయారు. తరువాత గుర్తు చేసుకుని.. తాను ఎమోషనల్ అవడం వలనే ఇలా జరిగిందని అన్నారు.

మీరే నాకు స్ఫూర్తి
ఇక్కడ ఉన్నవారు చాలా మంది వారికీ తానే స్ఫూర్తి అని చెబుతున్నారు. వాస్తవానికి మీరే నాకు స్ఫూర్తి అని అన్నారు. మీలో ఉన్నవారు ఎటువంటి స్వార్థం లేకుండా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాబట్టి మీరే నాకు స్ఫూర్తి అని చిరంజీవి డల్లాస్ లో ప్రసంగించారు.


Click it and Unblock the Notifications











