తాళ్లతో కట్టి రామ్ చరణ్‌ని హింసించారు.. చిరంజీవి ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న సురేఖ
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ని తాళ్లతో కట్టి కొడుతుంటే చూడలేక పోయారట ఆయన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ రామ్ చరణ్‌ని తాళ్లతో కట్టి హింసించాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఈ విషయాన్ని చిరంజీవి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ వివరాలు చూద్దామా..

పరిస్థితులు మారాయి.. నిజంగా జరిగిందా..?
ఆశ్చర్యపోకండి.. రామ్ చరణ్‌ని తాళ్లతో కట్టి కొట్టడం నిజం కాదు! ఆయన తాజా సినిమా RRR షూటింగ్‌లో భాగంగా ఈ సీన్ చిత్రీకరిస్తున్నారట. గతంలో సినిమాల్లాగా ఇప్పటి పరిస్థితులు లేవు కదా. అందుకే రియాలిటీకి దగ్గరగా కొన్ని సీన్స్ తెరకెక్కించాల్సిన అవసరం వస్తోంది. ఆ కారణం గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. 'నిజంగా హింసిస్తున్నారా?' అనిపించేలా ఆ సన్నివేశం షూట్ చేస్తున్నారట జక్కన్న.

RRRలో అల్లూరి సీతారామరాజు
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

చిరంజీవి- సురేఖ.. చూడగానే ఎమోషనల్
కాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న RRR షూటింగ్ చూడటానికి చిరంజీవి దంపతులు అక్కడికి వెళ్లారట. ఆ సమయంలో రామ్ చరణ్‌ని తాళ్లతో కట్టి కొడుతూ ఈడ్చుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. అలా ఆ సీన్ చూడగానే చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారట. ఇక సురేఖ అయితే కన్నీళ్లు ఆపుకోలేక పోయిందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించారు.

విప్లవ వీరుడిగా మారే క్రమంలో
అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడిగా మారే క్రమంలో ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారట రాజమౌళి. చాలా సహజంగా ఉండేలా ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. దీంతో సీతారామరాజుకి ఎదురైన పరిస్థితి, రాజమౌళి చిత్రీకరిస్తోన్న విధానం, రామ్ చరణ్ పడుతున్న కష్టం చిరంజీవి దంపతులను తీవ్ర ఉద్వేగానికి గురిచేశాయట.

ఎన్టీఆర్ ఇలా.. రామ్ చరణ్ అలా
'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్టు RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అలరించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు.

RRR మూవీ
1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











