Chiranjeevi Surgery: చిరంజీవికి ఆ సర్జరీ.. ఆలస్యంగా తెలిసిన షాకింగ్ విషయం

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం చెరగనిది. ఎన్నో ఏళ్లుగా హవా చాటుతూ బాస్ అనిపించుకుంటున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. త్వరలో ఆయన భోళా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో ఉంచారు. అయితే ఇటీవల చిరంజీవి అమెరికాకు వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్లడానికి కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. కానీ తాజాగా ఆయన ఒక సర్జరీ చేసుకున్నారు. అందుకు సంబధించిన విషయాలు ఆలస్యంగా తెలవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం వరుస పెట్టి చిత్రాలతో జోష్ చూపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చాటుతున్న చిరంజీవి ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు నిలబడి సాయం అందిస్తుంటారు.

Chiranjeevi Gets Minor Leg Surgery In America Trip News Goes Viral

ప్రస్తుతం చిరంజీవి అమెరికాలో ఉన్నారు. అయితే ఆయన కొన్ని రోజులుగా కాలి సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. అమెరికా కూడా వెళ్లింది ఆ సమస్య నుంచి రిలీఫ్ పొందడానికేనని సమాచారం. కొన్ని రోజులు టూర్ తోపాటు కాలికి సర్జరీ సైతం చేయించుకున్నారట మెగాస్టార్. ఈ విషయాన్ని మొదటగా సీక్రెట్ గా ఉంచినప్పటికీ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ, ఇదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదని టాక్.

చిరింజీవి కాలికి చాలా మైనర్ సర్జరీ జరిగిందని సమాచారం. ఓ ఎయిర్ పోర్టులో కూడా హ్యాపీగా నడుస్తూ చిరు వెళ్లారట. దీంతో అభిమానులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.

భోళా శంకర్ సినిమానే కాకుండా మలాయళ హిట్ మూవీ బ్రో డాడి రీమేక్ లో నటిస్తున్నారు. చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలో ఈ మూవీ చేయనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీయ్ అయినట్లు తెలుస్తోంది. చిరంజీవి అమెరికా నుంచి తిరిగి రాగానే మూవీ స్టార్ట్ చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X