For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  GodFather First Review: చిరంజీవి 'గాడ్‌ఫాదర్' గురించి దారుణంగా.. సినీ క్రిటిక్ రివ్యూ

  |

  సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకో ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అక్టోబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ఫస్ట్ రానే వచ్చేసింది. మరి గాడ్ ఫాదర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా!

  ప్రత్యేకమైన ఇమేజ్‌..

  ప్రత్యేకమైన ఇమేజ్‌..

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు.

  'లూసీఫర్'కు రీమేక్‌గా

  'లూసీఫర్'కు రీమేక్‌గా

  మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'గాడ్ ఫాదర్' మూవీ. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాను ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

  కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా..

  కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవికి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.

  ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన..

  దీంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌, తాజాగా వచ్చిన ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. అలాగే ఇటీవల ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అలాగే హిందీలో కూడా చాలా గ్రాండ్ గా సినిమా హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు.

  దసరా కానుకగా..

  దసరా కానుకగా..

  ఇక అత్యంత భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 5న చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ఎలా ఉందనే ఉత్కంఠత నెలకొంది. దీన్ని పటాపంచలు చేస్తూ గాడ్ ఫాదర్ ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. ప్రముఖ సెన్సార్​ సభ్యుడు, సినీ క్రిటిక్ అయిన ఉమర్​ సంధు.. గాడ్ ఫాదర్ సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో తెలిపాడు. ఈ రివ్యూను సోషల్​ మీడియా వేదికగా షేర్​ చేశాడు.

  చిరంజీవి దయచేసి రెస్ట్ తీసుకోండి.. ​

  చిరంజీవి దయచేసి రెస్ట్ తీసుకోండి.. ​

  ''సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన గాడ్ ఫాదర్ మొదటి రివ్యూ ఇది. బీ, సీ క్లాస్ ఆడియెన్స్ కు ఇది ఒక యావరేజ్ సినిమా. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంది. చిరంజీవి దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి. చిరంజీవి మీరు మంచి కంటెంట్ ఉన్న సాలిడ్ స్క్రిప్ట్స్ ఎంచుకోండి. ఈ ప్రజల మనిషి అని చెప్పుకునే, మాస్ హీరో వంటి పాత్రల్లో నుంచి బయటకు రండి. చెత్త స్క్రిప్ట్స్ లతో మీ టాలెంట్ ను వృథా చేసుకోకండి. మీరు మెగాస్టార్. కానీ స్క్రిప్ట్ ఎంపికలో మాత్రం అది కనిపించట్లేదు'' అని రాసుకొస్తూ 2కు 1గా రేటింగ్ ఇచ్చాడు సినీ క్రిటిక్ ఉమర్ సంధు.

  English summary
  Megastar Chiranjeevi Godfather Movie First Review By Film Critic Umair Sandhu And Say Old Wine In A New Bottle.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X