చిరంజీవి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారా? అక్కడికెందుకు వెళ్తున్నారు? అసలు మ్యాటర్..?

Recommended Video

Megastar Chiranjeevi Undergoing Ayurvedic Treatment, Why ? || Filmibeat Telugu

ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' పనులతో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చిరు తన తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరు ట్రీట్‌మెంట్ తీసుకున్నదంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు కథ ఏంటి? వివరాలు చూస్తే..

మెగా 152 ప్రాజెక్టు.. మరిన్ని జాగ్రత్తలు

మెగా 152 ప్రాజెక్టు.. మరిన్ని జాగ్రత్తలు

సైరా తర్వాత చిరు కెరీర్‌లో మెగా 152 ప్రాజెక్టుగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ సినిమా రూపుదిద్దుకోనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ముఖ్యంగా స్క్రిప్ట్‌కి తగ్గట్టుగా చిరంజీవి లుక్‌పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు.

కేరళ రాష్ట్రంలో ట్రీట్‌మెంట్

కేరళ రాష్ట్రంలో ట్రీట్‌మెంట్

ఇప్పటికే సైరా సినిమా కోసం కాస్త సన్నబడిన చిరంజీవి.. మెగా 152 లో మరింత స్లిమ్ గా కనిపించనున్నాడట. ఈ మేరకు ఆయన ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నారని, అందుకోసం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నాడని సమాచారం అందుతోంది. గతంలో ఆయన రీ ఎంట్రీ సమయంలో కూడా ఆయన కేరళ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

నాగార్జున సలహా మేరకు

నాగార్జున సలహా మేరకు

స్లిమ్ లుక్‌లోకి మారేందుకు కేరళలో నాచురల్ ట్రీట్‌మెంట్ బెటర్ అని అప్పట్లో చిరంజీవికి నాగార్జున సూచించారని టాక్. అయితే ఖైదీ నెంబర్ 150 సమయంలో అది బాగానే వర్కవుట్ కావడంతో కొరటాల సినిమా కోసం బరువు తగ్గడానికై నాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ దిశగా ఆలోచన చేస్తున్నారట చిరు. అదన్నమాట అసలు మ్యాటర్.

చిరు పుట్టినరోజు స్పెషల్

చిరు పుట్టినరోజు స్పెషల్

‘సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే మెగా 152 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 22న ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుందని టాక్.

చిరు రోల్ అదేనా..?

చిరు రోల్ అదేనా..?

ఇక ఈ సినిమాలో చిరంజీవి పోషించే రోల్ విషయమై ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సినిమా ఉండనుందని, ఇందులో రైతుగా చిరు కనిపించనున్నాడని కొన్ని వార్తలు వినిపిస్తుండగా.. హాకీ కోచ్‌గా చిరు డిఫెరెంట్ రోల్ పోషిస్తున్నాడని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికైతే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X