twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో... మెగాస్టార్ చిరంజీవి దొంగ పాట జోరు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : చిరంజీవి నటించిన చిత్రాల నుంచి ఎన్నో హిట్ సాంగులు వచ్చాయి. ఆయన చిత్రాల్లోని పాపులర్ పాటలు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇందులో వింతేముంది? అనుకుంటున్నారా. ఆయన పాటలు ఇక్కడ వినిపిస్తే వింతేమీ లేదుకానీ....మన పక్కదేశం అయిన చైనాలో వినిపిస్తే వింతే మరి.

    చిరంజీవి నటించిన 'దొంగ' సినిమాలో 'గోలీమార్' సాంగుకు ఇక్కడ ఎంత ప్రాచుర్యమో తెలుసుకదా. ఆ మధ్య చైనాలోని ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోలో అదే పాటను ఓ యువకుడు రీమిక్స్ చేసేశాడు. ఆ సాంగు ట్యూన్స్ చైనీయులకు బాగా నచ్చాయి. తెలుగు రాక పోయినా...ఆ పాటకు చైనీయులు తెగ వినేస్తున్నారు.

    పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం 'దొంగ' చిత్రంలో గోలి మార్ పాట బాగా పాపులర్ అయింది. ఈ పాటకు..... మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది.

    దొంగ సినిమా వివరాల్లోకి వెళితే...ఏ. కోదండరామి రెడ్డి దర్వకత్వంలో రూపొందిన ఈచిత్రానికి త్రివిక్రమరావు నిర్మాత. కె.చక్రవర్తి సంగీతం అందించారు. చిరంజీవి సరసన రాధ హీరోయిన్. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 1985లో ఈచిత్రం విడుదలైంది.

    English summary
    Chiranjeevi Donga movie 'Golimar' song popular in China. Donga released on March 14, 1985. This film was directed by A. Kodandarami Reddy, and stars Chiranjeevi and Radha. This film is produced by T. Trivikram Rao and was distributed by his company Vijayalakshmi Art Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X