కత్తిదూసి.. వీరనారి రుద్రమదేవీలా అదరొట్టిన చిరంజీవి మనవరాలు.. మెగాస్టార్ ఫిదా

సినీ పరిశ్రమలోకి ఎలాంటి అండ లేకుండా అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి వటవృక్షంలా మారిపోయారు. తన కుటుంబం నుంచే డజనుపైగా హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తన తర్వాత రెండో తరాన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ మూడో మనువరాలు సంహిత నటనా ప్రతిభకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్‌గా మారింది. రుద్రమదేవీలా కత్తిపట్టి వీరనారిగా నటించిన తీరు అందర్ని ఆకట్టుకొంటున్నది. ఆ వీడియోలో సంహిత ఎలా ఆకట్టుకొన్నారంటే..

సోషల్ మీడియాలో యమబిజీగా

సోషల్ మీడియాలో యమబిజీగా

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత యమ బిజీగా మారిపోయారు. ఇప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి తన అనుభవాలను అభిమానులతో పంచుకొంటున్నారు. తాజాగా తన మూడో మనవరాలు సంహిత నటనా ప్రతిభను సోషల్ మీడియాలో షేర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఖడ్గదారియై రుద్రమదేవీలా

ఖడ్గదారియై రుద్రమదేవీలా

మెగాస్టార్ షేర్ చేసిన వీడియోలో మనవరాలు బేబి సంహిత రుద్రమదేవీలా నటిస్తూ.. మా సామ్రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ప్రజలు సుభిక్షంగా హాయిగా ఉండాలని మా కోరిక, మా సిద్దాంతం. అందుకోసమే రుద్రమదేవీ ఖడ్గధారియై వచ్చింది. శత్రువులకు నేనంటే భయం. అందుకే హాయిగా ఉన్న మా రాజ్యంపైకి దండెత్తి వస్తున్నారంటూ ఏకధాటిగా డైలాగ్స్‌ అదరగొట్టారు.

నన్ను దొంగ దెబ్బ తీస్తారా?

నన్ను దొంగ దెబ్బ తీస్తారా?

నా రాజ్యాన్ని కాపాడుకొనేందుకు గోన గన్నారెడ్డి లాంటి వారిని ఎందరినో నియమించుకొన్నాను. నన్ను దొంగ దెబ్బ తీస్తారా? ముందు రోజుల్లో నా మనవడు బుద్ది చెప్పడానికి వస్తారు. జై కాకతీయ సామ్రాజ్యానికి జై.. కాకతీయ సామ్రాజ్యానికి జై అంటూ రుద్రమ దేవీలా సంహిత నటించారు.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
చిరంజీవి ముద్దుల వర్షం

చిరంజీవి ముద్దుల వర్షం

రుద్రమదేవీలో పౌరుషమైన డైలాగ్స్‌తో అదరగొట్టిన సంహితపై మెగాస్టార్ చిరంజీవి ముద్దుల వర్షం కురిపించారు. వావ్.. బ్యూటిఫుల్ సంహి.. లవ్ లవ్ యూ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. చిన్నారి ప్రతిభను అందరికి చూపించాలనే చిరు తాపత్రయంతో ఆ వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తల్లి ఎలాగో కూతురు కూడా అలానే అంటూ ప్రశంసించారు. చిన్నప్పుడు సుస్మిత ఫోటోను షేర్ చేస్తూ సంహిత వీడియోను కూడా తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X