twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ పిక్స్ : వైరల్ అవుతున్న చిరంజీవి మనవరాలి ఫోటోస్, కళ్యాణ్ ఎమోషనల్...

    |

    మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నాలుగు నెలల క్రితం ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. శ్రీజ-కళ్యాణ్ దేవ్ దంపతుల తొలి సంతానం. తమ ముద్దుల కూతురికి నవిష్క అనే పేరు పెట్టుకున్నారు. కళ్యాణ్ దేవ్-శ్రీజ దంపతులు తొలిసారి నవిష్క ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

    గురువారం నవిష్క జన్మించి 4 నెలలు పూర్తయిన సందర్భంగా కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఫోటోస్ రిలీజ్ చేశారు. నవిష్క ఫస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ చిన్నారిని ఆశీర్వదిస్తూ లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

    కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్

    కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్

    ‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే విషయాన్ని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే... నువ్వు పుట్టిన క్షణం నుంచే నీ ప్రేమలో పడ్డాను నవిష్క.'' అంటూ తన కూతురికి నాలుగు నెలలు పూర్తయిన విషయాన్ని వెల్లడిస్తూ కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

    ఆ క్షణం నుంచే హ్యాపీ మూడ్లో కళ్యాణ్ దేవ్

    ఆ క్షణం నుంచే హ్యాపీ మూడ్లో కళ్యాణ్ దేవ్

    తాను తండ్రి అవుతున్న విషయం తెలిసిన మరుక్షణం నుంచే కళ్యాణ్ దేవ్ హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయాడు. గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ అప్పట్లో అతడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    రెండున్నరేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్

    రెండున్నరేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్

    శ్రీజ, కళ్యాణ్ వివాహం 2016, మార్చి 28న జరిగింది. దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ... ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కళ్యాణ్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

    మెగా ఫ్యామిలీ హీరోగా కళ్యాణ్ దేవ్

    మెగా ఫ్యామిలీ హీరోగా కళ్యాణ్ దేవ్

    శ్రీజను పెళ్లాడిన తర్వాత కొన్ని రోజులకే కళ్యాణ్ దేవ్ నటన వైపు అడుగులు వేశారు. మెగా ఫ్యామిలీ వారసత్వంతో ‘విజేత' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. తొలి సినిమాతో ఫర్వాలేదనిపించి ఈ మెగా ఫ్యామిలీ అల్లుడు సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

    English summary
    "Now I believe in love at first sight, because I’ve loved you from the moment you were born #Navishka . Happy 4 Months to you!" Kalyaan Dhev shared his daughter photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X