ఆమె కోసం చిరంజీవి అతిధి పాత్రలో....
ఎక్స్ పీరియన్డ్స్ యాక్టర్స్ నటకిరిటీ రాజేంద్రప్రసాద్, సుహాసిని మణిరత్నం, ఈ ఇద్దరూ జంటగా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జొన్నాడ రామ్మూర్తి నిర్మాతగా దినేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కథ పరంగా రాజేంద్ర ప్రసాద్ మరియు సుహాసిని ఇక ఇన్ కమ్ టాక్స్ ఆఫిసర్ కాగా మరొకరు బ్యాంక్ ఆఫీసర్. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించడానికి ఓప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్, సుహాసిని కలిసి చిరంజీవిని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా కోరారట. వీళ్ళ కోరిక మేరకు చిరంజీవి నటించడానికి అంగీకరించి నట్టు సమాచారమ్. ఇదే కనుక నిజమైతే త్వరలోనే వెండితెర పై చిరు మళ్ళీ కనువిందు చేస్తాడని చెప్పొచ్చు. ఈ చిత్రంలో నరేష్, రఘుబాబు, ఝాన్సీ, తదితరులు నటించనున్నారు.
చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ సుహాసిని దినేష్ బాబు జొన్నాడ రామ్మూర్తి chiranjeevi rajendra prasad suhasini dinesh babu jonnada ramamurthy


Click it and Unblock the Notifications