చిరుతో గుణశేఖర్
చిరంజీవితో చూడాలని వుందిలాంటి సక్సెస్ ఫుల్ సినిమా చేసిన గుణశేఖర్ చిరంజీవితో మరో సినిమా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే చిరంజీవితోనే తీసిన మృగరాజు సినిమా గుణశేఖర్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇపుడు చిరంజీవితో మూడో సినిమాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే గుణశేఖర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం సినిమా నిర్మిస్తే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ సినిమా ఇంకా ఫైనల్ కానప్పటికీ గుణశేఖరే చిరంజీవి 149వ చిత్రానికి దర్శకత్వం వహించవచ్చని అనుకుంటున్నారు. ఈ చిరంజీవి సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే అధికారికంగా చిరంజీవి కానీ, గుణశేఖర్ కానీ ప్రకటించలేదు. ఏదేమైనా చిరంజీవి తదుపరి సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారో ఏమో కానీ ఊహాగానాలు మాత్రం పెరిగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











