‘శుభలేఖ రాసుకున్నా ఎదలో..' రీమిక్స్ పై చిరంజీవి
హైదరాబాద్ : చిరంజీవి 'కొండవీటి దొంగ' చిత్రంలోని 'శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..అనే పాటని రామ్ చరణ్ తాజ్ చిత్రంలో రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట విషయమై సంగీత దర్శకుడు తమన్ ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రసంసించారని సమాచారం. ఈ పాటని రీమిక్స్ చేయటానికి ఫర్మిషన్ తీసుకున్న తమన్ ..తర్వాత ఈ పాట ఫైనల్ కాపీని చిరంజీవికి వినిపించారు. రిమిక్సెడ్ వెర్షన్ ని విన్న చాలా ప్రసంశించారని తమన్ చెప్తున్నారు.
కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ లో కనిపంచనుంది. డివీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కోల్‌కత్తాలో పూర్తయింది. అక్కడ రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ కోసం త్వరలో చిత్ర యూనిట్ గ్రీస్‌కు వెళుతోంది. అక్కడ రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, అమలాపాల్ తోపాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్‌లపై అక్కడి అందమైన ప్రదేశాల్లో పాటలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరుగుతుందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి నాయక్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అలాగే ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్ గా ది లీడర్ అని పెట్టారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం జిలేబి అనే పాత్రలో కనిపించి అలరించనున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. బ్రహ్మానందం, జయప్రకాష్‌డ్డి, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, రాహుల్‌దేవ్, ప్రదీప్‌రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోట.కె. నాయుడు, కథ,మాటలు: ఆకుల శివ, నిర్మాత: డివీవీ దానయ్య, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీవీ వినాయక్.


Click it and Unblock the Notifications











