అభిమాని గుండెకు అండగా మెగాస్టార్ చిరంజీవి.. కరోనా ముప్పు వేళ..
ఎన్నో ఏళ్లుగా తనను ఆరాధిస్తున్న అభిమానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే స్పందించారు.
తన అభిమాని యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్ వైద్యుడితో చెక్ చేయించి ఆమె అనారోగ్యానికి కారణాలను తెలుసుకొన్నారు. వైద్య చికిత్స అత్యవసరమని వైద్యులు సూచించడంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌కు చేరుకొన్న నాగలక్ష్మికి బుధవారం సర్జరీ నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మెగాస్టార్ తన వారితో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తనను అమితంగా ప్రేమిస్తున్న అభిమాని ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్న చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆమె కుటుంబ సభ్యులు అన్నారు.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కరోనా క్రైసింగ్ చారిటీతో వందలాది వేతన కార్మికులను ఆదుకోవడం, అలాగే సిని పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications