బలగం మొగిలయ్యకు చిరంజీవి చేయూత.. అందుకోసం ఆర్థిక సాయం.. వీడియో వైరల్
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తున్నాయి. అలాంటి వాటిలో తాజాగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సినిమానే బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇందులో కుటుంబ బంధాలు, అనురాగం, ఆప్యాయతలు వంటి సన్నివేశాలతో హృద్యంగా మలిచారు. ఇక క్లైమాక్స్ చివర్లో ప్రతి ఒక్కరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది 'తోడుగా మా తోడుండి' పాట. ఈ పాట పాడిన గాయకుడు మొగిలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి చేయూతనందించారు.
కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, అపూర్వ లక్ష్మి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి ప్రేక్షాకదరణ పొందుతోంది. ఓటీటీలోకి వచ్చిన కూడా థియేటర్లలోకి వెళ్లి మరి సినిమాను ఆదరించారు.

ఇక బలగం సినిమాలో హైలెట్ గా నిలిచింది క్లైమాక్స్ సాంగ్. ఈ పాట చూసి ఏడ్వని ప్రేక్షకులు లేరు. ఈ పాటను బుర్ర కథ కళాకారులు మొగిలయ్య, కొమురవ్వ దంపతులు అద్భుతంగా పాడారు. అయితే మొగిలయ్యకు కరోనా ప్రభావంతో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో ఆయన రెగ్యులర్ గా డయాలిసిస్ చేయించుకుంటున్నాడు. అంతేకాకుండా బీపీ పెరగడంతో మొగిలయ్యకు కంటి చూపు కూడా దెబ్బతింది.
ఇటీవలే డయాలిసిస్ చేసే క్రమంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తోంది ప్రభుత్వం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయకర్ రావు పర్యవేక్షిస్తున్నారు. అయితే మొగిలయ్య కంటి సర్జరీకి అయ్యే తానే భరిస్తానని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారట. మొగిలయ్య నిమ్స్ ఆస్పత్రిలో చేరకముందు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు గురించి మొగిలయ్య దంపతులు తెలిపారు.
తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి.. డైరెక్టర్ వేణు యెల్దండికి ఫోన్ చేసి కంటి సర్జరీకి కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తానని చిరు చెప్పినట్లు మొగిలయ్య భార్య కొమురవ్వ తెలిపారు. ఈ విషయాన్ని వేణు తమకు ఫోన్ చేసి చెప్పినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి గొప్ప మనసు చూసి నెటిజన్లు, అభిమానులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











