‘జంజీర్’ తెలుగు వెర్షన్ యోగి చేతుల్లో పెట్టిన చిరు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. అయితే తెలుగు మార్కెట్‌పై, డబ్బింగ్ కార్యక్రమాలపై హిందీ దర్శకుడైన అపూర్వ లకియా, అక్కడి నిర్మాతలకు అంతగా అవగాహన లేక పోవడం వల్ల డ ఆ బాధ్యతలను పర్‌ఫెక్టుగా నిర్మహించే బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు యోగేష్ కృష్ణచంద్ర మునుగాటికి అప్పగించారు. జంజీర్ చిత్రం తెలుగు వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఈయనే చూసుకోనున్నారు. ఈ విషయం శనివారం చిరంజీవి అధికారిక సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడైంది. ఈ మేరకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు యోగేష్.
జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత.
చెర్రీ బాలీవుడ్ తొలి చిత్రం కావడంతో చిరంజీవిపై ఈచిత్రంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు చిరంజీవి ఇలా చేయడంలో ఆశ్చర్య పోవాల్సిన పనేమీ లేదు. చరణ్ తనలా రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా బాలీవుడ్లో రాణించాలని చిరంజీవి తాపత్రయ పడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











