హాట్ సీట్లో చిరంజీవి: నాగార్జునతో అనుబంధం (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఒకరితో ఒకరు పోటీ పడటం, కొన్ని సార్లు గొడవలు పడటం సర్వ సాధారణమే. తెలుగు సినిమా పరిశ్రమ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. కానీ తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల మధ్య మధ్య మొదటి నుండీ ఆరోగ్య కరమైన పోటీ వాతావరణం ఉంది. ఇద్దరి మధ్య ముందు నుండీ మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు వీరు అనేక సందర్భాల్లో కలిసారు. వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. కానీ ఈ సారి మాత్రం వీరు డిఫరెంటుగా కలవబోతున్నారు. ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే...మరొకరు వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

అవును! మీరు ఊహించింది నిజమే. అక్కినేని నాగార్జున నేతృత్వంలో నడుస్తున్న 'మీలో ఎవరు కోటిశ్వరుడు' అనే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీన ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. అదే విధంగా నాగార్జున చిరంజీవిని అడిగే ప్రశ్నలు కూడా హాట్ హాట్‌గా ఉండబోతున్నాయి.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో విద్యా బాలన్, శ్రీయ, లక్ష్మి మంచు, చార్మి కౌర్, అల్లరి నరేష్ లాంటి వాళ్లు హాట్ సీట్లో కూర్చుని సందడి చేసారు. త్వరలో చిరంజీవి 150వ సినిమాకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన బోతుండటం చర్చనీయాంశం అయింది.

చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న అనుబంధానికి గుర్తులుగా ఉన్న కొన్ని ఫోటోలు స్లైడ్ షోలో.....

నాగార్జున, చిరంజీవి ఫ్రెండ్షిప్

నాగార్జున, చిరంజీవి ఫ్రెండ్షిప్

నాగార్జున, చిరంజీవి మొదటి నుండి తమ మధ్య ఉన్న స్నేహాన్ని ఎంతో బాగా మెయింటేన్ చేస్తూ వస్తున్నారు.

నంది అవార్డ్స్ కార్యక్రమంలో...

నంది అవార్డ్స్ కార్యక్రమంలో...

2002లో జరిగిన నంది అవార్డ్స్ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున ఇలా....

ఎఎన్ఆర్ సన్మాన కార్యక్రమంలో...

ఎఎన్ఆర్ సన్మాన కార్యక్రమంలో...

అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో నాగార్జున, చిరంజీవి

మహేష్ బాబుకు అవార్డు ఇస్తూ...

మహేష్ బాబుకు అవార్డు ఇస్తూ...

2013లో జరిగిన సినీ‘మా' అవార్డ్స్ కార్యక్రమంలో మహేష్ బాబు అవార్డు అందిస్తున్న చిరంజీవి, నాగార్జున.

వెంకటేష్, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున

వెంకటేష్, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున

వెంకటేష్, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున తదితరులు గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

టి-20 టాలీవుడ్ ట్రోపీ

టి-20 టాలీవుడ్ ట్రోపీ

ఆ మధ్య జరిగిన టి-20 టాలీవుడ్ ట్రోపీ డ్రెస్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

శ్రీను వైట్లకు అవార్డు ఇస్తూ...

శ్రీను వైట్లకు అవార్డు ఇస్తూ...

2012లో మాటీవీ అవార్డ్స్ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్లకు అవార్డు అందజేస్తున్న చిరంజీవి, నాగార్జున.

సాక్షి పేరస్ ప్రారంభోత్సవంలో...

సాక్షి పేరస్ ప్రారంభోత్సవంలో...

కొన్నేళ్ల క్రితం జరిగిన సాక్షి న్యూస్ పేపర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున ఇలా పక్క పక్కనే.

అక్కినేనితో...

అక్కినేనితో...

ఆ మధ్య అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో వెంకటేష్, చిరంజీవి, నాగేశ్వరరావు, నాగార్జున, టి సుబ్బిరామిరెడ్డి.

అక్కినేని సంతాప సభలో..

అక్కినేని సంతాప సభలో..

అక్కినేని నాగేశ్వరరావు మరణం తర్వాత జరిగిన సంతాప సభలో నాగార్జున, చిరంజీవి ఇలా...

గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.25

గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.25

గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.25 షూటింగ్ సందర్భంగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

టీఎస్ఆర్ టీవీ 9 ఫిల్మ్ అవార్డ్స్

టీఎస్ఆర్ టీవీ 9 ఫిల్మ్ అవార్డ్స్

టీఎస్ఆర్ టీవీ 9 ఫిల్మ్స్ అవార్డుల కార్యక్రమంలో నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X