మ‌హాన‌టిని చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లాయి.. నా గుండె బ‌రువెక్కింది.. మేం బతుకుతాం.. చిరంజీవి

By Rajababu

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక‌ద‌త్త్, స్వ‌ప్న ద‌త్త్ నిర్మించిన మ‌హాన‌టి ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల్ని శ‌నివారం ఉదయం ఆయ‌న ఇంట్లో స‌న్మానించారు.ఈ స‌మావేశంలో అశ్వినీ ద‌త్త్, నాగ్ అశ్విన్, స్వ‌ప్న ద‌త్త్, ప్రియాంక‌ద‌త్త్ పాల్గొన్నారు.

 మహానటి సావిత్రితో నా పరిచయం

మహానటి సావిత్రితో నా పరిచయం

నాకు తెలిసిన వారందరికీ నా అభిమాన నటి మహానటి సావిత్రి అని అందరికి తెలుసు. ఈ సందర్బంగా ఆమెతో ఉన్న పరిచయం గురించి నేను చెప్పుకోవాలి. నేను కెమెరా ముందు నిలబడిన తొలిచిత్రం పునాదిరాళ్లు. ఆ చిత్రంలో హీరోకు తల్లిగా సావిత్రి నటించింది. నేను హీరోకు స్నేహితుడిగా నటించాను. అప్పుడు ఆమెతో కలిసి రెండు, మూడు సీన్లలో నటించే అదృష్టంగా భావిస్తాను.

 సావిత్రిగారు దీవించారు

సావిత్రిగారు దీవించారు

చిన్నతనం నుంచి ఆమె అంటే చాలా ఇష్టం, అభిమానం. అదే విషయాన్ని ఆమెతో పంచుకొన్నాను. దాంతో ఆమె సంతోషించి నా బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకొన్నారు. భవిష్యత్‌లో మంచి ఆర్టిస్టుగా కావాలని సావిత్రిగారు ఆకాంక్షించారు. అది అద్భుత‌మైన సంఘ‌ట‌న‌.

నాగ అశ్విన్‌పై మీమాంస

నాగ అశ్విన్‌పై మీమాంస

సావిత్రి లాంటి మహోన్నతమైన నటి జీవిత కథ ఆధారంగా నా మిత్రుడు అశ్వినీదత్‌ నిర్మాణ పర్యవేక్షణలో సినిమా తెరకెక్కుతున్నందంటే చాలా ఆనందపడ్డాను. మరో వైపు ఎలా తీస్తారో అనే మీమాంస కూడా కలిగింది. ఎందుకంటే దర్శకుడు నాగ అశ్విన్ యువకుడు. ఆయన తీసిన మొదటి సినిమా చూశాను. బావుంది. ఎక్కడో విదేశాల్లో చదువుకొన్నాడు. సినీ పరిశ్రమ గురించి ఏం అవగాహన ఉంది. సావిత్రి గురించి ఏం తెలుసు అనే ప్రశ్నలు మదిలో మెదిగాయి. ఎంత‌వ‌ర‌కూ దీనికి న్యాయం చేయగ‌ల‌డ‌ని సందేహాలుండేవి. కానీ మహానటి సినిమా చూసిన తర్వాత ఆ మీమాంసలన్నీ పటాపంచలైపోయాయి

నాగ అశ్విన్ శెభాష్ అనిపించాడు

నాగ అశ్విన్ శెభాష్ అనిపించాడు

మహానటి సినిమా చూస్తున్నంత సేపు హృదయం బ‌రువెక్కింది. క‌ళ్లు చెమ‌ర్చాయి. అద్భుతంగా చేసి నాగ్ అశ్విన్ శెభాష్ అనిపించాడు. క‌థ పై ఎంత రీసెర్చ్ చేశాడో సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని, కీర్తిని పెంచిన‌వాడు అయ్యాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయంగా తెలుగు ప‌రిశ్ర‌మ మ‌రో పెక్కి ఎక్కింది. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి క‌థ‌లు స్ఫూర్తిదాయ‌కంగా ఉండాలి.

అద్భుతంగా తెరకెక్కించారు

అద్భుతంగా తెరకెక్కించారు

సావిత్రి గారు ఎంత అందంగా ఉన్నారు? ఆమె చిన్న‌ప్ప‌టి బాల్యం? స‌్టార్ అయిన త‌ర్వాత ఆమె ప‌రిస్థితులు? త‌ర్వాత ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? అనేది అద్భుతంగా చూపించారు. అది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ చాలా అందంగా..అద్భుతంగా చూపించారు. మోహ‌న్ బాబు, స‌మంత‌, విజ‌య దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య చిన్న చిన్న పాత్ర‌లు చేసారంటే...చిరస్థాయిగా ఉంటుంద‌ని చేశారు.

కీర్తీ సురేష్ జీవించింది

కీర్తీ సురేష్ జీవించింది

సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌డం అన‌డం కంటే జీవించింది అన‌డం క‌రెక్ట్. సినిమా లోకి వెళ్లే కొద్ది సావిత్రిని చూస్తున్న‌ట్లు అనిపించి. దుల్కార్ సల్మాన్ జెమిని గ‌ణేష్ గారిలానే అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌తో క‌లిసి రుద్ర‌వీణ చేసాను. ఇలా ప్ర‌తీది ఈ సినిమా న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అందుకే ఈసినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యాను. సినిమా చూసి ఎంతో సంతృప్తి చెందాను. సావిత్రి గారికి వాళ్లు ఇచ్చిన ఘ‌న నివాళి ఇది.

ఆ లోటు తీర్చారు

ఆ లోటు తీర్చారు

అశ్వినీద‌త్ గారు బాస్ మీతో? రామారావుగారితో నేను ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశాను. క‌మ‌ర్శియ‌ల్ గా హిట్ అయ్యాయి. కానీ పూర్ణోద‌య సంస్థ‌లాంటి చేసిన అవార్డు సినిమాలు చేయ‌లేన‌ని చాలా సంద‌ర్భాల్లో అసంతృప్తి వ్య‌క్తం చేసేవారు. కానీ `మ‌హాన‌టి` సినిమా ద్వారా కుమార్తెలు ద‌త్ కు అద్భుత‌మైన గిప్ట్ ఇచ్చారు. తండ్రికి ఇంత స‌క్సెస్ ఇచ్చి కొడుకు లేని లోటును తీర్చారు. ఈ సినిమాకు రివార్డులే కాదు..అవార్డులు కూడా వ‌స్తాయి. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలి అని అన్నారు.

ఆ తేదీ మహత్యం

ఆ తేదీ మహత్యం

మే 9న నా `జ‌గ‌దీక‌వీరుడు అతిలోక సుంద‌రి` సినిమా రిలీజైంది. అదే రోజున `మ‌హాన‌టి` కూడా రిలీజైంది. అనుకోకుండా జ‌రిగిందో...కావాల‌ని అలా ప్లాన్ చేసారో? తెలియ‌దు గానీ! చాలా సంతోషంగా ఉంది. అందుకు మ‌హాన‌టి టీమ్ అంద‌ర్నీ అభినందిస్తున్నా` అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X