చెన్నయ్ లో చిరంజీవి???
చిరంజీవి చెన్నయ్ లోనే ఉన్నాడా..ఉన్నాడనే అనిపిస్తోంది. ఆయన చెన్నయ్ లో ఆదివారంనాడు దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్ లో ఒక సినిమా చూశాడట. ధనుష్, దివ్య, డానియెల్ బాలాజీ నటించిన పొల్లదవన్ సినిమాను చిరంజీవి వీక్షించాడట. ఈ చిత్రానికి సంగీతం జి.వి.ప్రకాశ్ అందించగా వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను చూసిన చిరంజీవి ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాడట. కథనం తీరు ఆయనకు బాగానచ్చిందట. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తెజ్ హీరోగా రీమేక్ చేయనున్నాడట.


Click it and Unblock the Notifications











