twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదంలో మెగాస్టార్ చిరంజీవి.. పునాదిరాళ్లు దర్శకుడు మృతి

    |

    మెగాస్టార్ చిరంజీవిని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడతూ ఆయన శనివారం ఉదయం మృతి చెందారు. దర్శకుడు రాజ్‌కుమార్ మృతితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. ఇక రాజ్ కుమార్ మరణం గురించి వివరాల్లోకి వెళితే..

    రాజ్‌కుమార్‌కు చిరంజీవి చేయూత

    రాజ్‌కుమార్‌కు చిరంజీవి చేయూత

    దర్శకుడు, నిర్మాత రాజ్‌కుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం గురించి తెలుసుకొన్న చిరంజీవి తగు చర్యలు తీసుకొన్నారు. ఆయనను అపోలో హాస్పిటల్‌లో చేర్పించి వైద్య పరీక్షలు చేయించారు. ఇటీవల ఆయన ఆరోగ్యంలో మెరుగు కనిపించినా.. శనివారం ఉదయం ఆకస్మికంగా తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు.

    చివరి దశలో విషాదంగా

    చివరి దశలో విషాదంగా

    దర్శకుడు రాజ్‌కుమార్ జీవిత చివరి అంకంలో విషాదకరమైన, ఒంటరితనాన్ని అనుభవించాడు. తన పెద్ద కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత భార్య కూడా చనిపోవడంతో రాజ్‌కుమార్ ఒంటరివాడు అయిపోయారు. దాంతో మానసికంగా కుంగి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక పరిస్థితి కూడా దిగజారడంతో అద్దె ఇంట్లో ఉంటూ జీవితాన్ని గడిపారు. మరణాంతరం ఆయన పార్దీవ దేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌కుమార్ మరణవార్తను తెలుసుకొన్న వెంటనే పలువురు ప్రముఖులు అపోలోకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.

    తొలి చిత్రానికే ఐదు నందులు

    తొలి చిత్రానికే ఐదు నందులు

    గూడపాటి రాజ్‌కుమార్ స్వస్థలం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. సినిమాలపై ఆసక్తితో పరిశ్రమలో పలుశాఖల్లో పనిచేసి దర్శకుడిగా మారారు. తన తొలి సినిమాకే ఐదు నంది అవార్డులు సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత ఈ సమాజం మాకొద్దు, మనవూరి గాంధీ, ఇంకా తెలవారదేమి? తాండవకృష్ణ తరంగం, మా సిరిమల్లి లాంటి చిత్రాలను రూపొందించారు. అలీ, బాబు మోహన్, అజయ్ ఘోష్, కవిత, సురేఖ వాణి లాంటి ఎందరో కొత్త నటీనటులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు.

    Recommended Video

    Tollywood Heroes Fans Unity On Sugali Preethi Issue, Supports Pawan Kalyan | Filmibeat Telugu
    వారం రోజుల్లో చిరంజీవికి రెండోసారి విషాదం

    వారం రోజుల్లో చిరంజీవికి రెండోసారి విషాదం

    కాగా, గత వారంలో రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి తనకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయారు. రెండు రోజుల క్రితం ప్రముఖ జర్నలిస్టు పసుపులేటి రామారావు, ఇప్పుడు పునాది రాళ్లు దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ మరణించడం మెగాస్టార్‌ విషాదంలో కూరుకుపోయారు. పలువురు సినీ ప్రముఖులు రాజ్‌కుమార్ మరణవార్తను తెలుసుకొని దిగ్బ్రాంతికి గురయ్యారు.

    English summary
    Chiranjeevi in deep sadఫ Punadirallu director Gudipati Rajkumar no more. Rajkumar was fell ill few months. He was getting treatment at apollo hospital since few months and died on Feb 15th, 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X