twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెను విషాదం‌లో చిరంజీవి ... అత్యంత ఆప్తులను కోల్పోయిన మెగాస్టార్..

    |

    మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తనకు అత్యంత ఆప్తులైన ముగ్గురిని ఒకే రోజు కోల్పోవడంతో ఆయన తీవ్రంగా కలత చెందినట్టు తెలుస్తున్నది. ఆ విషాదాన్ని మెగాస్టార్ తన ట్విట్టర్‌లో ద్వారా వెల్లడించారు. తన అభిమాన సంఘాల్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అభిమాన నేతలతోపాటు కారావన్ డ్రైవర్‌ను కూడా కోల్పోవడం మరింత విషాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    మెగా అభిమానుల మృతితో

    మెగా అభిమానుల మృతితో

    చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి కొద్ది రోజలు క్రితం కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ కదిరి పట్టణంలో మ‌ృతి చెందారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమంలో పాలు పంచుకొన్న బ్లడ్ బ్రదర్ ప్రసాదరెడ్డి మరణంతో చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. ప్రసాదరెడ్డి మరణంతో మెగా అభిమానులు విషాదంలోకి మునిగిపోయారు. నాగబాబు, సాయిధరమ్ తేజ్ వారికి సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

    హైదరాబాద్‌లో వెంకట రమణ మరణంతో

    హైదరాబాద్‌లో వెంకట రమణ మరణంతో

    చిరంజీవికి అత్యంత అప్తుడైన అభిమాని వెంకట రమణ కూడా కోవిడ్19 పాజిటివ్‌తో బాధపడుతూ ఈ లోకాన్ని వీడారు. ఇలా ఒకే రోజు రెండు విషాద వార్తలతో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది. ఇక చిరంజీవి అభిమానిగా ఎన్నో కార్యక్రమాల్లో సేవ అందించిన వెంకటరమణ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

    Recommended Video

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
    చిరంజీవి ప్రగాఢ సంతాపం

    చిరంజీవి ప్రగాఢ సంతాపం


    అభిమానులు ప్రసాదరెడ్డి, వెంకటరమణ మరణాలతో విషాదానికి గురైన చిరంజీవి ట్విట్టర్ ద్వారా వారికి సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అంటూ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

    విషమంగా కారావాన్ డ్రైవర్‌

    విషమంగా కారావాన్ డ్రైవర్‌

    ఇదిలా ఉండగా, చిరంజీవి కారావాన్‌కు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే డ్రైవర్‌కు మెరుగైన చికిత్స అందించి కాపాడుకోవడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వార్త అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

    జర్నలిస్టులకు, కార్మికులకు ఉచిత వ్యాక్సిన్‌

    జర్నలిస్టులకు, కార్మికులకు ఉచిత వ్యాక్సిన్‌

    ఇలాంటి దుర్వార్తల సమయంలో సినీ వర్గాలను కాపాడుకోనేందుకు CCC ముందుకొచ్చింది. కరోనా లాక్‌డౌన్ కాలంలో సినీ కార్మికులకు, జర్నలిస్టులకు అండగా నిలిచిన కరోనా క్రైసిస్ చారిటీ (ccc) ద్వారా మరోసారి సినీ వర్గాలను ఆదుకొనేందుకు సిద్ధమయ్యారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మెగాస్టార్ వీడియో రిలీజ్ చేసి.. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 24/7 సౌజన్యంతో చేపడుతున్నాం అని తెలిపారు.

    English summary
    Chiranjeevi condolences to Prasada Redddy, Venkata Ramna. Chiranjeevi Yuvatha President Prasada Reddy no more: Mega heroes Naga Babu and Sai Dharam Tej condolences that.. We have lost another strong pillar in our #MegaFans .May his soul rest in peace. Strength to the family during this tough times. RIP Prasada Reddy garu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X