నందులు వ్యవహారంపై దాసరికి..చిరంజీవి చురకలు
"నంది అవార్డులు వస్తాయి పోతాయి. కావాలని వాటిని తెచ్చుకోకూడదు" అంటూ దాసరి నారాయణరావు పై పరోక్ష వ్యాఖ్యలు చేసారు చిరంజీవి. సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'ఆరెంజ్' చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. నంది అవార్డులు వాటంతట అవే రావాలని చెప్పారు. వాటికంటే కూడా ప్రేక్షకుల అభిమానమే గొప్ప అన్నారు.అలాగే ప్రేక్షకులు, అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చి, ఆ తర్వాత మనలోని నటుణ్ణి సంతృప్తిపరచుకునే పాత్రలు చేయాలి. నేను 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు' లాంటివి అలా చేసినవే. వాటికి నంది అవార్డులు వచ్చాయి. కానీ కావాల్సింది ప్రేక్షకుల రివార్డులు. నంది అవార్డులు వస్తాయి, పోతాయి. కావాలని వాటిని తెచ్చుకోకూడదు. వాటంతట అవే రావాలి. వాటికంటే ప్రేక్షకుల అభిమానమే గొప్పది'' అని చెప్పారు. ఇక ఇటీవల 2009 సంవత్సరానికి నంది అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును రాంచరణ్‌కి కాకుండా 'మేస్త్రి' చిత్రానికి గాను దాసరి నారాయణరావుకు ప్రకటించడంపై చిరంజీవి అభిమాన సంఘాలు, పీఆర్పీ శ్రేణులు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. పైగా 'మేస్త్రి' చిరంజీవికి వ్యతిరేకంగా తీసిన చిత్రమనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.


Click it and Unblock the Notifications











