తమన్నా అంటే ఇష్టం: చిరంజీవి మరోసారి ఇలా...
హైదరాబాద్: తమన్నా గ్లామర్, పెర్ఫార్మెన్స్‌కు ముగ్దుడైపోయిన మెగాస్టార్ చిరంజీవి.... ఆ మధ్య ‘రచ్చ' ఆడియో ఫంక్షన్లో ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన మాట్లాడుతూ... ‘కథ డిమాండ్‌ని బట్టి 150వ సినిమా ఉంటుంది. ఆ సినిమా నేను చేస్తే, అందులో తమన్నా హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని నా కోరిక' అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్య పరిచారు చిరంజీవి. అయితే ఇదంతా అప్పట్లో ‘రచ్చ' ఆడియో ఫంక్షన్‌కు హాజరైన అభిమానులను ఉత్తేజ పరచడానికే చిరంజీవి తమన్నా గురించి అలా మాట్లాడారనేది విస్పష్టం.
తాజాగా మరోసారి చిరంజీవి తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాఘవేంద్రరావు హోస్ట్ చేస్తున్న ‘సౌందర్య లహరి' షోలో పాల్గొన్న చిరంజీవి తమన్నా గురించి మాట్లాడారు. తాను గతంలో నటించి సూపర్ డూపర్ హిట్ అయిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లో శ్రీదేవి పోషించిన పాత్రకు నేటి తరం హీరోయిన్లలో తమన్నాకే నా ఓటు వేస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

'జగదేకవీరుడు అతిలోకసుందరి' దర్శకేంద్రుడు రాఘవేంద్రుని దృశ్యకావ్యమన్నారు. అలాంటి సినిమాను రీమేక్ చేస్తే తాను హీరోగా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అదే నేటి తరం యువ హీరోల్లో అయితే రామ్ చరణ్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. ఇక హీరోయిన్‌గా శ్రీదేవి స్థానంలో తమన్నాను ఎంపిక చేస్తానని చెప్పారు.


Click it and Unblock the Notifications











