శిరీష్ హీరో అంటే షాకయ్యాం: ఫ్యాన్స్ మీట్లో చిరు (ఫోటోలు)
హైదరాబాద్: చిరంజీవి వారసత్వ మార్కుతో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో అల్లు శిరీష్. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న 'గౌరవం' చిత్రం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 19న విడుదలవుతున్న నేపథ్యంలో మెగా అభిమానులకు శిరీష్‌ను పరిచయం చేసే కార్యక్రమం హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయి మెగా అభిమానులకు అల్లు శిరీష్‌ను ఇంట్రడ్యూస్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... 'మూడు దశాబ్దాలుగా నన్ను నటుడిగా ఆదరించి, తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోని అదే తరహాలో ఆదరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు శిరీష్ ను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.

అభిమానులకు శిరీష్ ను పరిచయం చేస్తున్న చిరంజీవి.

శిరీష్ గురించి అభిమానులకు వివరిస్తున్న చిరు.

చిరంజీవి, అల్లు శిరీష్ లతో పాటు వేదికపై అల్లు అర్జున్.
ఇంకా మాట్లాడుతూ... 'శిరీష్ చాలా తెలివైన వాడు. గీతా ఆర్ట్స్ అధినేతగా ఉంటాడు అనుకున్నా. కానీ హీరో అవుతాను అనగానే అంతా షాకయ్యాం. కానీ వెంటనే గుడ్ చెయ్యి... మీ బ్లడ్ లోనే నటన ఉంది కాబట్టి చెయ్యి అన్నాను. ఇప్పుడు గౌరవం ట్రైలర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరిలా కమర్షియల్ చిత్రం కాకుండా సామాజిక న్యాయం నేపథ్యంలో సాగుతున్న చిత్రం. కుల వ్యవస్థని ఎత్తి చూపే ఓ కథానాయకుడి పాత్రలో శిరీష్ కనిపించడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత ప్రకాష్ రాజ్ నాకు కథ కూడా వినిపించాడు. ఆలోచింప చేసే విధంగా బాగుంది. గౌరవంతో ప్రారంభమైన శిరీష్ కెరీర్ కు మెగా అభిమానులందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను' అన్నారు.


Click it and Unblock the Notifications











