twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవి నా ఫేవరేట్ కోస్టార్...

    By Sindhu
    |

    'ఆ ఒక్కటి అడక్కు" చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన రంభ ఆ తర్వాత చిరంజీవి (హిట్లర్, బావగారూ బాగున్నారా, ఇద్దరు మిత్రులు), బాలకృష్ణ (భైరవద్వీపం), వెంకటేష్ (ముద్దుల ప్రియుడు) వంటి అగ్రహీరోలతో పాటు ఇటీవల అల్లు అర్జున్ (దేశముదురు), ఎన్టీఆర్ (యమదొంగ) చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లోనూ అలరించింది.

    ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రంభ హీరోలపై తన మనోభావాలను వెలిబుచ్చింది. 'మెగాస్టార్ చిరంజీవి నా ఫేవరెట్ కోస్టార్" అని చెప్పింది. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ 'ఫస్ట్ చిరంజీవి గారితో 'హిట్లర్" చిత్రంలో నటించేటప్పుడు అబ్బా...చిరంజీవిగారితో యాక్ట్ చేస్తున్నానని తెగ సంబరపడిపోయాను. ఆయన ముందు నిలబడడానికి, కూర్చోవడానికి చాలా సిగ్గు పడిపోయేదాన్ని.

    'హబీబీ.." సాంగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ చిరంజీవిగారితో 'సార్..నేను మీ ఫ్యాన్" అని మాట్లాడాను. అప్పుడు ఆ సినిమా కెమెరామెన్, మిగతా యూనిట్ మెంబర్స్ వచ్చి చిరంజీవి గారితో 'అవునండీ, మీ ఫ్యాన్..ఎప్పుడూ మీ గురించే చెప్తారు" అని చెప్పారు. అప్పుడు చిరంజీవిగారు నాతో మాట్లాడారు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకే తెలీదు. ఎంతో కో ఆపరేటివ్ గా నేను ఆయనకి కొత్త అయినప్పటికీ ఎంతో ప్రేమగా నాతో మాట్లాడారు. ఇప్పటికీ అది నేను మర్చిపోలేను" అంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X