చిరంజీవి అలాంటోడు కాదు: కృష్ణం రాజు, రూమర్లపై మెగా అభిమాని ఫైర్
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు సినిమాల్లోకి రాక ముందు నుండే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉండేదని, అప్పట్లో చాలా కెమెరాలు కొన్నానని, సినిమాల్లోకి వచ్చాక క్రమక్రమంగా తన హాబీని పక్కన పెట్టినట్లు తెలిపారు.

చిరంజీవికి గిఫ్టుగా ఇచ్చాను
ఓసారి లండన్లో చాలా ఖరీదైన కెమెరా కొన్నాను. అప్పట్లో ఓసారి చిరంజీవి బర్త్ జరిగినపుడు మా మేనల్లుడిని తీసుకుని ఆ వేడుకకు ఆ కెమెరా పట్టుకుని వెళ్లాను. ఆ కమెరాతో మా మేనల్లుడు ఫోటోలు తీస్తుంటే... చిరంజీవి వచ్చి అన్నా ఈ కెమెరా ఎప్పుడు కొన్నారు? నేను లండన్లో దీన్ని చూశాను... చాలా కాస్లీ అని కొనలేదని చెప్పాడు. అప్పుడు నేను వెంటనే ఆ కెమెరా తీసి చిరంజీవి మెడలో వేసి ఇది నీ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పడంతో చాలా ఆనంద పడ్డాడు.... అని కృష్ణం రాజు గుర్తు చేసుకున్నారు.
Recommended Video


చిరంజీవి టాలెంటే ఆయన్ను ఈ స్థాయికి
‘మనవూరి పాండవులు' సమయంలో చిరంజీవి రేడియోలో పాటలు వస్తుంటే డాన్సులు చేసేవాడు. నీలో మంచి రిథమ్ ఉంది, బాగా పైకొస్తావని చెప్పాను. చిరంజీవిలోని టాలెంటే అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని కృష్ణం రాజు తెలిపారు.

చిరంజీవి అలాంటోడు కాదు
చిరంజీవి చాలా మంచి స్నేహితుడు, ఎవరికీ హాని చేయాలనుకోడు. చెడుగా మాట్లాడటం, అపకారం చేయడం లాంటివి ఆయనకు తెలియదు అని కృష్ణం రాజు వెల్లడించారు.

ఇలాంటి ఫ్యామిలీ మధ్య ఇలాంటి వార్తలా?
కృష్ణం రాజు, చిరంజీవి ఇండస్ట్రీలో అన్నదమ్ములా మెలుగుతుంటారు. అలాంటి వీరి ఫ్యామిలీపై ఇటీవల వచ్చి ఓ రూమర్ అందరినీ షాక్ కు గురి చేసింది. మెగా డాటర్ నిహారిక, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి జరుగబోతోంది అంటూ ఆ రూమర్స్ సారాంశం. ఇలాంటి వార్తలు రావడంపై అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రభాస్‌ను నిహారిక అన్నయ్యా అని పిలుస్తారు
నిహారిక, ప్రభాస్ పెళ్లి రూమర్లపై మెగా అభిమాని ఒకరు తీవ్రంగా స్పందించారు. ప్రభాస్ ను నిహారిక అన్నయ్యా అని పిలుస్తుందని.... ఇలాంటి వార్తలు క్రియేట్ చేసిన వారిని చెప్పుతో కొట్టాలని మండి పడ్డారు. చిరంజీవి, కృష్ణం రాజు అన్నదమ్ముల్లా మెలుగుతారని అందరికీ తెలుసు అన్నారు.


Click it and Unblock the Notifications











