చిరంజీవి మంచాయనే కానీ...
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శాసన సభలో మాట్లాడినా, మరెక్కడ మాట్లాడినా నవ్వులు వెల్లివిరుస్తాయి. ఈసారి కూడా మీడియాతో మాట్లాడుతూ సెటైర్ లు విసిరారు. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తుందనే తెలుగుదేశం ఆరోపణను ఆయన ముందు ప్రస్తావిస్తే 1983కు ముందు ఈ కుల గజ్జి ఎక్కడుందట...చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచే కులగజ్జి రాజకీయాలు మొదలయ్యాయి. వాళ్ల గజ్జి మాకెందుకు అంటిస్తారు. ఆ గజ్జి వాళ్లనే ఉంచుకోమనండి అని నవ్వారు.
చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి వెనకాల కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని వస్తున్న వార్తను ప్రస్తావించగా...మాకేం పని ఆ పిల్లకాయలేదో పెళ్లి చేసుకుంటే మేమందుకు గోకుతాం..చిరంజీవి పార్టీ పెడితే నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. ఎన్టీఆర్ లాగా చిరంజీవి పార్టీ పెడతారా అన్న ప్రశ్నకు పెద్దాయన ఎక్కడ...చిరంజీవి ఎక్కడ..చిరంజీవి మంచాయనే కానీ రాజకీయాలు వేరుగా ఉంటాయి..అని బదులిచ్చారు.


Click it and Unblock the Notifications