చిరంజీవిని నేనెప్పుడు కెలికానండీ.. కొన్ని నచ్చనవి ఉండొచ్చు.. తమ్మారెడ్డి!
ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తరచుగా సినీ రాజకీయ, సామజిక అంశాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుండడం చూస్తూనే ఉన్నాం. తమ్మారెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాని గురించి స్పందించిన తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. తానెప్పుడూ ఎవరిని విమర్శించలేదని అన్నారు. సామాన్యుడిగా మాత్రమే నా అభిప్రయాలు తెలియజేస్తుంటానని అన్నారు. తమ్మారెడ్డి ప్రస్తుతం ఇండిస్ట్రిలో జరుగుతున్న కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

చిరంజీవిని కెలికాను అంటూ
తమాంరెడ్డి మాట్లాడుతూ.. ఎవరినైనా నేను ఎందుకు కెలుకుతాను. చిరంజీవిని కెలికాను అంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి. హెడ్డింగులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు నేను చిరుని ఎప్పుడు కెలికానండీ అంటూ తమ్మారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఇలాంటి పిచ్చి వార్తలు సృష్టిస్తారు అని తమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్నుప్రశ్నిస్తే
ఎవరైనా నన్నుప్రశ్నిస్తే దానిగురించి మాత్రమే నా అభిప్రాయాన్ని తెలియజేస్తా అని తమ్మారెడ్డి అన్నారు. ఆ సందర్భంలో ఏ హీరో ప్రస్తావన వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతా అని తమ్మారెడ్డి అన్నారు. చిరంజీవి గురించి అయినా, బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎవరి గురించి అయినా అడిగితేనే మాట్లాడుతా అని అన్నారు. వాళ్లందరితో నాకున్న చనువు వలనే కొన్ని విషయాలు మాట్లాడుతుంటానని అన్నారు.

విభేదాలు లేవు
నాకు ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ విభేదాలు లేవని తమ్మారెడ్డి అన్నారు. కానీ వారిలో నచ్చని అంశాలు ఉండొచ్చు. ఉదాహరణకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మాట్లాడా. అంతకు మించి ఆయనతో నాకు విభేదాలు లేవు. చిరంజీవితో విభేదాలు పెట్టుకునేంత స్థాయి కూడా నాకు లేదు అని తమ్మారెడ్డి అన్నారు.

ఒక సామాన్యుడిలా మాత్రమే
తాను ఒక సామాన్యుడిలా మాత్రమే కొన్ని ఆలోచనలు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటున్నానని తమ్మారెడ్డి అన్నారు. ఆ విషయాలతో అర్థం లేని వివాదాలు సృష్టించడం తగదని అన్నారు. తమ్మారెడ్డి చెబుతున్న విషయాలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడమే కాదు కొందరు ట్రోల్ కూడా చేస్తున్నారు. తమ్మారెడ్డి తాజా వివరణతో వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











