నేనెంత బరువు తగ్గాననేది ఫ్యాన్స్ కే ...చిరంజీవి
ఎంత బరువు తగ్గాననేది తన అభిమానులు తెరపై చూసుకుంటారని మెగాస్టర్ చిరంజీవి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన అమెరికా పర్యటన సినిమా కోసం స్లిమ్ అవడానికి ఉద్దేశించినదేనని ఓ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చిన ఆయన చాలా సన్నబడ్డట్లు కనపడటంతో ఆయన్ను మీడియావారు కలిసి ప్రశ్నించారు. దానికి ఆయన 'బరువు తగ్గుతున్నాను.. అయినా నా బరువు తగ్గుదల సా మాన్యులకు అవసరం లేదు. ధరలు తగ్గడం వారికి కావాలి' అన్నారు. ఇక సినిమాలో నటించే సన్నాహాల్లో ఉన్న ఆయన అందుకోసమే స్లిమ్ అయ్యారు. అలాగే ఆయన హీరోగా చేసే చిత్రానికి అధినాయుకుడు అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఠాగూర్ మధు ఈ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, వివి వినాయిక్ దర్శకత్వం,పరుచూరి బ్రదర్శ్ స్క్రిప్టు అందించనున్నారని అంతటా వినపడుతోంది.
More from Filmibeat
చిరంజీవి స్లిమ్ అధినాయకుడు వివి వినాయక్ ఠాగూర్ మధు పరుచూరి బ్రదర్శ్ chiranjeevi slim adhinayakudu vv vinayak tagore madhu paruchuri brothers


Click it and Unblock the Notifications











