ఎవడు : పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవే
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగే 'ఎవడు' ఆడియో వేడుకకు హాజరు కాబోతున్నారని అంతా అనుకున్నప్పటికీ.....చివరి నిమిషంలో ఆయన రావడం లేదనే విషయం ఖరారైంది. 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగులో భాగంగా యూరఫ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ షూటింగ్ ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ రావాల్సి ఉన్నప్పటికీ ఆడియో వేడుకకు అందే పరిస్థితి లేదు.
'ఎవడు' యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేయబోతున్నారని స్పష్టమవుతోంది. ఆడియో వేడుకకు ఎవరు హాజరవుతారనే దానిపై ఖశ్చితమైన సమాచారం లేక పోవడంతో నిర్వాహకులు ముందు జాగ్రత్తగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లకు సంబంధించిన భారీ ప్లెక్సీలు శిల్పకళా వేదిక ఆవరణలో ఏర్పాటు చేయడం గమనార్హం.
'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై చివరి వారంలో 'ఎవడు' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు పోషిస్తున్నారు.. సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











