రామ్ చరణ్ చూస్తే అసూయగా ఉందంటున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ని చూసి అసూయ చెందుతున్నారా!? అవునని ఆయనే చెప్పాక ఇంకా అనుమానంగా అడుగటం ఎందుకు? ఎప్పుడా అని అనుకుంటున్నారా. ఏబిఎన్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరు స్వయంగా ఒప్పుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు ప్రస్తావించారు.
చిరు 'పునాది రాళ్ళ" వరకు శివవంకర ప్రసాద్ గానే ఉన్నానని, ఆ తరువాత తనకు కలలో వచ్చిన సందేశంతో చిరంజీవిగా మార్చుకున్నానని అన్నారు. తనకు సినీ రంగంలో గాడ్ ఫాదర్ లేడని కేవలం తనకు అల్లురామలింగయ్య మామ మాత్రమే అని తాను స్వయం కృషితో ఈ రంగంలో ఎదిగానని అన్నారు. జయకృష్ణ తనకు అల్లురామలింగయ్య కూతురితో వివాహం కావటానికి కారణం అన్నారు. అంతే కాక తన కొడుకు తాను 30 సంవత్సరాలలో సాధించిన విజయాన్ని కేవలం రెండు సినిమాలతో తన కొడుకు సాధించాడని దీనికి సంతోషంగా ఉన్నా అసూయగా కూడా ఉందన్నారు. అయితే చరణ్ కి వాడి బాబు చిరంజీవి ఉన్నాడు కానీ అప్పట్లో చిరంజీవికి ఎవ్వరూ లేరు అన్నారు.
ఇక రాజకీయాలలో తనకు ఓటమి గెలుపులు రెండూ ఒక్కటే అన్న చిరు తన సోదరులు తనకు రాజకీయాలో సహకారం అందిస్తారని చెప్పారు. రామ్ తాను కలసి నటించే అవకాశం ఉందన్న చిరు అది చరణ్ కోరిక, ప్రజల కోరిక అని సరైన కథ దొరికితే చేస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











