ఎంతో ఘనంగా జరిగిన నాగచైతన్య జోష్ చిత్రం ఆడియో పంక్షన్ కి చిరంజీవి గాని,ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గానీ అటెండ్ కాకపోవటంపై పరిశ్రమలో రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. పంక్షన్ కి మోహన్ బాబు అటెండ్ కాకపోవటం వల్ల చిరంజీవి కావాలనే ఎవాయిడ్ చేసారని కొందరు అంటూంటే తిరుపతిలో పార్టీ పనుల్లో బిజీగా ఉండటంతో రాలేదని మరికొందరు చెప్తున్నారు. సర్లే చిరంజీవి రాకపోయినా నాగచైతన్య సమవయస్కులు రామ్ చరణ్ తేజ,అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరు వచ్చినా బాగుండేది అని వినిపిస్తోంది. అందులోనూ ఆర్యతో హిట్ అల్లు అర్జున్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన దిల్ రాజు చిత్రం కావటంతో మరింత చర్చనీయాంసంగా మారింది. అయితే చిరంజీవి తాను రాలేకపోతున్నానంటూ వీడియో రికార్డెడ్ శుభాకాంక్షలు పంపంటం మాత్రం అందరికీ నచ్చుతోంది. అందులోనూ చిరంజీవికి,నాగార్జునకీ ఉన్న వ్యాపార స్నేహాన్ని ఈ సందర్భంగా జనం గుర్తు చేసుకున్నారు. అయితే దిల్ రాజు మరో క్లోజ్ ప్రెండ్ హీరో ప్రభాస్ కూడా ఈ పంక్షన్ కి అటెండ్ కాలేదు. అతను ప్రస్తుతం బ్యాంకాక్ లో ఏక్ నిరంజన్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.