నిశ్చితార్థానికి ముందే మెగా-కామినేని ఫ్యామిలీస్ అక్కడ...
నిశ్చితార్థానికి ముందు రోజైన ఈ రోజు(నవంబర్ 30) మెగా, కామినేని కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పటల్ కు చేరుకుని ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యర్రమానికి చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులు, ఉపాసన తాత ప్రతాప్ సి. రెడ్డి, రామ్ చరణ్, ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆహ్వానితులకు తప్ప మరెవ్వరికీ ఎంగేజ్మెంట్ వేడుకకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.
కాగా...చెర్రీ-ఉపాసన నిశ్చితార్థ వేడుకకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ద్వారక తిరుమల రావు మీడియాకు వెల్లడించారు. వీరి నిశ్చితార్థం డిసెంబర్ 1న చిలుకూరు బాలాజీ టెంపుల్ దారిలోని కామినేని వారి ఫాం హౌజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ వేడకకు సంబంధించిన పోటోలు, వీడియో చిత్రీకరించేందుకు మీడియాకు అనుమతి లేదు. ఇరు కుటుంబాల వారు ఏర్పాటు చేసుకున్న కెమెరా మెన్లు వేడకను చిత్రీకరించిన తర్వాత అందులో వేటిని మీడియాకు విడుదల చేయాలనే విసయం మెగా కుటుంబీకులు డిసైడ్ చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











