మాస్ మన ప్రాణం బాసూ.. అటే దృష్టిపెట్టు.. చెర్రీకి చిరంజీవి క్లాస్.. మాస్ డైరెక్టర్ కన్ఫర్మ్?

By Rajababu

Recommended Video

Chiranjeevi Is Not Fully Satisfied With Cherry's Movies చెర్రీకి చిరంజీవి క్లాస్

కొత్త తరహా చిత్రాలను చేయాలనే తపన కనిపించే యువ హీరోల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ ఒకరంటే ఎలాంటి సందేహపడ అక్కర్లేదు. ఎందుకంటే మగధీర, ధ్రువ చిత్రాలు ఆయన టెస్ట్‌కు అద్దం పట్టాయి. చెర్రీ ఎంపిక తగినట్టుగానే ఆ చిత్రాలు భారీ హిట్స్‌గా మారాయి. అయితే హీరో ఇమేజ్ దూరంగా ఉండే విధంగా తన చిత్రాలను ఎంపిక చేసుకొంటున్నాడు. ఈ విషయంలో ఇటీవల రాంచరణ్‌ను మెగాస్టార్ చిరంజీవి కాస్త మందలించాడట. అసలేం జరిగిందంటే..

 మాస్ హీరోగానే

మాస్ హీరోగానే

మెగాస్టార్ చిరంజీవి అటు మాస్, ఇటు క్లాస్ హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. అందుకే ఆయనను మెగాస్టార్ చేశారు. ఆయన వారసత్వం పుచ్చుకొని వచ్చిన రాంచరణ్ తొలుత మాస్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

 ట్రాక్ తప్పుతున్న రాంచరణ్

ట్రాక్ తప్పుతున్న రాంచరణ్

అయితే ఇటీవల కాలంలో మాస్ ట్యాగ్ నుంచి బయటపడి కుటుంబ తరహా చిత్రాలను చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అందుకు గోవిందుడు అందరివాడేలే ఓ ఉదాహరణ. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 రాంచరణ్‌పై మెగాస్టార్ అసంతృప్తి

రాంచరణ్‌పై మెగాస్టార్ అసంతృప్తి

ఇలా మాస్ ఇమేజ్‌ను వదిలేయడం మెగాస్టార్‌కు నచ్చలేదంట. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించినా కమర్షియల్ పంథాను వదులకోకూడదు అనే మాటను చెప్పినట్టు సమాచారం. అటు మాస్.. ఇటు క్లాస్ చిత్రాల్లో నటిస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతామనే చిదంబర రహస్యాన్ని జూనియర్‌ చెవిలో వేశారట.

రంగస్థలం తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి

రంగస్థలం తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి

దర్శకత్వంలో సినిమా చేయాలని గట్టిగానే సూచించారంట. తండ్రి సూచన, సలహాలను తుచ పాటించే రాంచరణ్ బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రంగస్థలం తర్వాత బోయపాటి సినిమా కన్ఫర్మ అంటున్నాయి ఫిలింనగర్ సర్కిల్స్.

 కథపై బోయపాటి కసరత్తు

కథపై బోయపాటి కసరత్తు

ప్రస్తుతం రాంచరణ్ ఇమేజ్‌ను, మెగా పవర్‌ను దృష్టిలో పెట్టుకొని కథపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మాస్ ఆడియెన్స్ పల్స్ ఎరిగిన బోయపాటి శ్రీను తన కథలో పక్కాగా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకొంటున్నాడట.

 మాస్ ఎలిమెంట్స్‌తో

మాస్ ఎలిమెంట్స్‌తో

ఇక మాస్ డైరెక్టర్‌గా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్త వెలుగు చూసినప్పటి నుంచి మెగాభిమానులు తెగ ఆనందపడిపోతున్నారట. తన విశేష అనుభవంతో మెగా పవర్ స్టార్‌కు చిరంజీవి సరైన ట్రాక్‌లో పెడుతున్న మెగాస్టార్‌కు థ్యాంక్స్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X