చిరంజీవి 152 గ్రాండ్ అప్‌డేట్.. టైటిల్‌పై ఫైనల్ డిసీజన్.. కొరటాల స్కెచ్ అంటే ఇదే మరి!
ఖైదీ నెంబర్ 150 ద్వారా సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో తన చిరకాల కోరిక తీర్చుకున్నాడు. చారిత్రాత్మక చిత్రాల్లో కూడా తనకు సాటెవ్వరూ లేరని నటనతో నిరూపించారు. ఇక ఈ సినిమా తర్వాత తన 152వ సినిమా కోసం అంతా సిద్ధం చేస్తున్నారు చిరు. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్‌డేట్ మెగా అభిమాన వర్గాలను ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఏంటా అప్‌డేట్? వివరాల్లోకి పోతే..

కొరటాల చేతిలో చిరంజీవి
సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ రాసుకున్న కథలను సినిమాలుగా మలచడంలో దిట్ట కొరటాల శివ. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ ఈ డైరెక్టర్ రూపొందించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం అదే కొరటాల శివ చేతిలో చిరంజీవి 152 ప్రాజెక్ట్ పడింది. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

ముహూర్తం కుదిరింది.. రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే
ఇటీవలే ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమాలు జరుపుకుంది. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అయితే తాజా సమాచారం మేరకు మెగా 152గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టుకోనుందని తెలుస్తోంది.

టైటిల్‌పై ఫైనల్ డిసీజన్
ఇక ఈ సినిమా టైటిల్ విషయమై ఎప్పటినుంచో వార్తల్లో వినిపిస్తున్న పేరు గోవింద ఆచార్య. కానీ ఈ మధ్యకాలంలోనే 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే కథ రీత్యా ఇదే టైటిల్ సినిమాకు బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట కొరటాల. ఈ మేరకు 'గోవిందా హరి గోవిందా' టైటిల్‌నే ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

కొరటాల స్కెచ్.. అఫీషియల్‌గా ఆ రోజే ప్రకటన
'గోవిందా హరి గోవిందా' టైటిల్ పై ఓ డిసీజన్ తీసుకున్న కొరటాల.. ఇదే టైటిల్ అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే రోజే ఈ టైటిల్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారట కొరటాల.

కథ అంతా దాని చుట్టే.. చిరు కెరీర్‌లోనే స్పెషల్
ఇక ఈ సినిమా కథాంశం దేవాలయాల నేపథ్యంలో ఉండనుందని టాక్. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసే ఆఫీసర్‌గా చిరు నటించబోతున్నారట. అందుకే స్టైలిష్ లుక్ కోసం ప్రస్తుతం చిరంజీవి కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా చిరు కెరీర్ లోనే స్పెషల్ మూవీ కానుందని టాక్ నడుస్తోంది.
Recommended Video

త్రిష, ఈషా రెబ్బాతో చిరు రొమాన్స్
మరోవైపు ఈ మెగా ప్రాజెక్టులో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్రిష, ఈషా రెబ్బాలను ఫైనల్ చేశారని సమాచారం. చిత్రంలో ఈ ఇద్దరితో చిరంజీవి చేసే రొమాంటిక్ సీన్స్ కూడా స్పెషల్ తీరు ఇవ్వనున్నాయట.


Click it and Unblock the Notifications











