Acharya Teaser గుణపాఠాలు చెబుతానని అలా అంటారేమో.. అదరగొట్టేసిన చిరు
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య నుంచి అసలు సిసలు అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన వారికి ఆ తరుణం వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ అప్డేట్ ఇవ్వడంపై చిరు వేసిన ట్వీట్, ఆ మీమ్ ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. టీజర్ అప్డేట్ ఇవ్వడంతో అలసత్వం వహించిన కొరటాలను చిరు మందలిస్తున్నట్టుగా వదిలిన మీమ్ తెగ వైరల్ అయింది. అయితే అంతుకు మించి అనేలా ఇప్పుడు ఈ టీజర్ దుమ్ములేపుతోంది.

అలా అప్డేట్..
మెగాస్టార్ చిరంజీవి కొరటాల ఇద్దరూ కూడా ఆచార్య టీజర్ గురించి మాట్లాడుకుంటున్నట్టుగా.. అందులో కొరటాలను చిరు మందలిస్తున్నట్టుగా ఓ మీమ్ బయటకు వచ్చింది. దాన్ని స్వయంగా చిరు దగ్గరుండి మరీ ఎడిట్ చేయించినట్టుంది. అలా చిరు తన లీకుల మీద తానే సెటైర్లు వేస్తూ ఆచార్య టీజర్ అప్డేట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

అప్డేట్ కంటే ఎక్కువగా..
అలా చిరు ఇచ్చిన అప్డేట్ కంటే వేసిన మీమ్, అందులోని సంభాషణ, కామెడీ టైమింగ్ ఇలా అన్నీ కూడా వైరల్ అయ్యాయి. అలా ఆచార్య టీజర్ అప్డేట్‌ను జనాల్లోకి ఈజీగా తీసుకెళ్లగలిగారు. అయితే ఇప్పుడు వచ్చిన టీజర్ కూడా జనాల్లోకి చొచ్చుకుపోతోంది.

నేషనల్ వైడ్‌గా ట్రెండ్..
రెండ్రోజుల క్రితం టీజర్ అప్డేట్‌తో ఆచార్య నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు కూడా ఆచార్య టీజర్ సోషల్ మీడియాలోని అన్ని వేదికల్లో రచ్చ రచ్చ చేస్తోంది. ట్విట్టర్‌లో ఆచార్య టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ టీజర్‌ను అభిమానులు షేర్లు, లైకులు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
టీజర్ అలా..
ఇతరుల కోసం జీవించేవారిని దైవంతో సమానం అంటారు.. అలాంటి వారికి కష్టం వస్తే దైవమే దిగిరావాల్సిన పని లేదంటూ రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్.. కొరటాల ఇచ్చిన ఎలివేషన్.. మణిశర్మ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ స్థాయి ఎక్కిడికో వెళ్లిపోయింది. చివర్లో చిరు చెప్పిన పంచ్ డైలాగ్ కూడా అదిరిపోయింది. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. ఆచార్య అంటుంటారు.. గుణపాఠాలు చెబుతానని అలా అంటారేమో అని చిరు పలికిన సంభాషణలు కేకలా ఉన్నాయి.

అదే హైలెట్..
ముందే అనుకున్నట్టుగా ఈ టీజర్‌లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ఈమేరకు ముందే లీకులు కూడా వచ్చాయి. టీజర్‌లో చిరంజీవి కనిపించడం, చరణ్ వినిపిండంతో రచ్చ రచ్చగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇద్దరూ కలిసి తెరపై విజృంభిస్తే బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే.


Click it and Unblock the Notifications











